తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అతిగా దాహం వేస్తోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే! - డీహైడ్రేషన్

high thirsty causes: ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు రోజుకి అధిక మోతాదులో తీసుకోవాలి. అది నిజమైనప్పటికీ.. ప్రతి ఐదు-పది నిమిషాలకి ఒకసారి నీళ్లు తాగాలనిపిస్తే మాత్రం ప్రమాదమంటున్నారు నిపుణులు. ఇలా అతి దాహానికి గురైతే ఏదో ఒక అనారోగ్యానికి గురైనట్టేనని అంటున్నారు. వెంటనే డాక్టర్లను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. ఏం చేస్తే అతి దాహం నుంచి బయటపడవచ్చో తెలుసుకుందామా..

high thirsty causes
అతిదాహం

By

Published : Apr 28, 2022, 9:01 AM IST

high thirsty causes: దాహం వేస్తే ఎవరైనా ఏంచేస్తారు? నీళ్లు తాగుతారు లేదంటే పళ్లరసాలు, మరేవో ద్రవపదార్థాలు తాగుతారు. అది సరేగానీ తాగిన ప్రతి ఐదు-పది నిమిషాలకు ఓసారి మళ్లీ మళ్లీ దాహం వేస్తూ ఉంటే ఏమనుకోవాలి? ఎండలో వెళుతున్నప్పుడో, బాగా వ్యాయామం చేసినప్పుడో, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నప్పుడో అయితే అది వేరే మాట. వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు కూడా అలా అతిగా దాహం వేయవచ్చు. కానీ.. అలాంటి ఏ ఒక్కటీ లేనప్పుడు కూడా అదేపనిగా దాహం వేస్తుంటే ఏమిటి అర్థం? ఎవరైనా అప్పుడు కూడా మామూలు విషయంగానే తీసుకుంటే ప్రమాదానికి చేరువైనట్లే అంటున్నారు పరిశోధకులు.

ప్రత్యేకమైన కారణమేదీ లేకుండానే అతిగా దాహం వేస్తోందీ అంటే దాని వెనుక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండవచ్చుననేది నిపుణుల మాట. ముఖ్యంగా.. మదుమేహం, గుండె, కిడ్నీలు, కాలేయాలు దెబ్బతినడం వంటి కారణాలేవో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కొన్నిసార్లు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అలర్జీలు, పిత్తాశయ పనితీరులో లోపాల వంటి సమస్యలు కూడా ఈ అతిదాహానికి కారణం కావచ్చని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల అధిక దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రైేషన్ ప్రధాన లక్షణం దాహమని అంటున్నారు. శరీరంలో తగినంత నీరు శాతం లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. బిర్యానీ, మసలా పదార్థాలను తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారు మందులను నిత్యం వాడుకోవాలని అంటున్నారు. మద్యం జోలికి పోకూడదని హెచ్చరిస్తున్నారు.

ఇతర కారణాల వల్ల దాహం వేసే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రం రావడం, నీరసం, కడుపునొప్పి, చూపు మసకగా అనిపించడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం లో ఇంకెంత మాత్రం జాప్యం చేయకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కాస్త ఎక్కువగా దాహం వేయడం కూడా సమస్యేనా? అంటే మామూలు సమస్య కాదు.. ఒక్కోసారి అది ప్రాణాపాయానికి దారితీసే సమస్యగా పరిణమించవచ్చునని కూడా చెబుతున్నారు.

ఇవీ చదవండి: జలుబు ఉన్నవారు వేసవికాలంలో హాయిగా నిద్రపోవడం ఎలా?

ఈ ఆహారం తీసుకుంటే మీ చర్మం నిగనిగలాడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details