తెలంగాణ

telangana

హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 2:59 PM IST

High Cholesterol Peoples What Eat In Breakfast : మనం తీసుకునే ఆహారాన్ని బట్టి.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ స్టోర్ అవుతుంది. ప్రస్తుతం జీవనశైలి ప్రకారం.. మెజారిటీ జనాల్లో చెడు కొలెస్ట్రాల్‌ అధికంగా పేరుకుపోతోంది. ఇది హైరేంజ్​కు వెళ్తే.. ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంటుంది. మరి, అలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

High Cholesterol Peoples What Eat In Breakfast
High Cholesterol Peoples What Eat In Breakfast

High Cholesterol Peoples What Eat In Breakfast : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ మధ్య చాలా మందిలో బ్యాడ్​కొలెస్ట్రాల్‌ఎక్కువగా పెరిగిపోతోంది. శరీరంలో అధిక మొత్తంలో ఈ కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే.. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే చెడు కొవ్వు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల.. హై కొలెస్ట్రాల్‌ ఉన్నవారు వీలైనంత త్వరగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. వీరు ఉదయాన్నే తప్పకుండా మంచి ఆహారం తినాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి.. హై కొలెస్ట్రాల్ ఉన్నవారు ఉదయాన్నేబ్రెక్‌ఫాస్ట్‌లో ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బ్రేక్‌ఫాస్ట్‌ తప్పక తినాలి :
హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్‌ తినాలట. అదే సమయంలో మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకోసం పలు సూచనలు కూడా చేస్తున్నారు. మరి.. ఆ ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్వినోవా :
బార్లీ, ఓట్స్, గోధుమల లాగే, 'క్వినోవా' కూడా ఒక రకమైనటువంటి పంట. ఈ క్వినోవాలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పంటను బొలీవియా దేశంలో 'బంగారు పంట' అని పిలుస్తారు. దీన్ని 'కీన్‌వా' అని కూడా అంటారు. ఇవి విత్తనాలు లేదా గింజలు రూపంలో ఉంటాయి. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు బ్రేక్‌ఫాస్ట్‌లోకి క్వినోవా ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపించడంతో పాటు, ఇందులో ఉండే ప్రొటీన్స్, ఫైబర్స్‌ కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహాయపడతాయని అంటున్నారు.

వీగన్ డైట్​పై సందేహాలా? నిపుణుల క్లారిటీ ఇదే!

కూరగాయలు, ఫ్రూట్ సలాడ్ :
పీచు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల సలాడ్‌లను ఉదయాన్నే తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. దీనివల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. యాపిల్‌, ద్రాక్ష, సిట్రస్, స్ట్రాబెర్రీ తదితర పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్త సరఫరాను మెరుగు పరుస్తాయని, చక్కెర స్థాయిని తగ్గిస్తాయని చెబుతున్నారు. అందువల్ల వెజ్, ఫ్రూట్ సలాడ్ చాలా మంచిదని అంటున్నారు.

కోడి గుడ్డు :
హై కొలెస్ట్రాల్‌ ఉన్నవారు ఉదయాన్నే గుడ్డు తినాలి. అయితే.. అందులోని పచ్చసొన తినకుండా.. మిగిలిన తెల్లటి పదార్థాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ పచ్చసొనలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్‌ ఉంటుందని అంటున్నారు. దాదాపు ఒక గుడ్డులో 186 mg కొలెస్ట్రాల్ ఉంటుందని.. అందువల్ల తక్కువ పరిమాణంలో తినాలని సూచిస్తున్నారు.

ప్రాసెస్‌డ్ ఫుడ్‌, నూనె పదార్థాలు :
ప్రాసెస్ చేసిన ఆహారం, నూనె పదార్థాలకు హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటాయని అంటున్నారు. ఇంకా.. పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటి వాటిని వీరు ఎప్పుడూ తినకూడదని చెబుతున్నారు.

పీరియడ్స్​ కోసం మందులు వాడుతున్నారా? మరిన్ని చిక్కులొస్తాయి - ఇలా సరిచేసుకోండి!

ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

ABOUT THE AUTHOR

...view details