Hepatitis B Symptoms And Treatment :హెపటైటిస్ బి.. లివర్ కు అత్యంత ప్రమాదకరమై జబ్బు ఇది. నిశబ్ధంగా శరీరంలోకి చేరే ఈ వైరస్.. దీర్ఘకాలంలో కాలేయం క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి ఒంట్లోకి చేరిన వెంటనే దీని లక్షణాలు కనిపించవు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇంత ప్రమాదకరమైన హైపటైటిస్ బి అంటే ఏమిటి ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధికి చికిత్స ఏమైనా ఉందా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
హెపటైటిస్ ఎలా వస్తుంది..?
హెపటైటిస్ ద్వారా కాలేయంలోని ప్రతి కణానికీ వాపు వస్తుంది. ఇది వైరస్‌తో వ్యాపిస్తుంది. ఇందులో ఐదు రకాలున్నాయి. హైపటైటిస్ ఎ, సి, డి, ఈ కన్నా.. బి చాలా ప్రమాదం. గర్భిణులకు హెపటైటిస్ వస్తే ప్రమాదకరంగా ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకు హైపటైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. హెపటైటిస్ బీ, సీలు దీర్ఘకాలికంగా శరీరంలో కొనసాగితే.. లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
హైపటైటిస్ లక్షణాలు..
- అలసట
- కడుపు నొప్పి
- కామెర్లు (చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం)
- వికారం
- వాంతులు
- జ్వరం
- మూత్రం ముదురు రంగులో రావడం
- దురద
- కీళ్ల నొప్పులు
పైన తెలిపిన లక్షణాలు తొలినాళ్లలో కనిపించవు. ప్రమాద తీవ్రత పెరుగుతున్న కొద్దీ కనిపిస్తాయి. అదే సమయంలో అంత ప్రమాదకరంగా అనిపించకపోచ్చు. అందువల్ల చాలా మంది పెద్దగా పట్టించుకోరని వైద్యులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా?- అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే! జాగ్రత్త సుమా!