తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గుండెపోటుకు ఎన్నో కారణాలు.. మరి రాకుండా ఉండాలంటే ఎలా? - గుండె సమస్యకు పరిష్కారాలు

మధ్యవయస్కులతో పాటు యువతను వేధిస్తున్న సమస్యల్లో గుండెపోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ జబ్బు బారిన పడుతున్నారు. సరైన ఆహారం, శరీరానికి విశ్రాంతి లాంటి చిన్నపాటి జాగ్రత్తలను పాటిస్తే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

heart attack symptoms
heart attack symptoms

By

Published : Sep 25, 2022, 1:39 PM IST

గుండె జబ్బుల సమస్య ఈ మధ్య సాధారణమైపోయింది. చిన్న వయసులోనే గుండెపోటు బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం జీవనశైలిలోని మార్పులేనని వైద్యులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, దురలవాట్ల కారణంగా ఈ వ్యాధికి బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెపోటు బారినపడకుండా ఉండేందుకు వైద్యులు జాగ్రత్తలు చెబుతున్నారు. కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు

గుండెపోటుకు కారణాలు:

  • తీసుకునే ఆహారంలో మార్పులు. జంక్​ఫుడ్​కు అలవాటు పడిన యువత దాన్ని అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థం పేరుకుపోతోంది. అది గుండెపోటుకు కారణమవుతుంది.
  • ఉద్యోగాలు చేసేవారు ఒకేచోట కూర్చొని పని చేయడం, కూర్చున్న స్థానం నుంచి తరచూ కదలకపోవడం వల్ల ఊబకాయం భారిన పడే అవాకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.
  • సరైన వ్యాయామం చేయకపోవడం, పని ఒత్తిడి లాంటి సమస్యలు గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
  • ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా గుండె సమస్యలకు దారితీస్తుంది.
  • కొంత మందిలో చిన్న వయసులోనే పెరుగుతున్న కొలెస్ట్రాల్​, ఇతర జన్యూ సంబంధమైన అంశాల కారణంగా గుండెలోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
  • తర్వాతి కాలంలో విపరీతమైన శారీరిక శ్రమకు లేదా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గుండెలోని పూడికలు క్లాట్లుగా మారి గుండెపోటుకు దారితీస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.
  • కొవిడ్​ రక్తనాళాలపై ప్రభావం చూపడం వలన కూడా గుండెపోటు పెరుగుతున్నాయి.
  • ఇన్ఫెక్షన్ల వంటి అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా గుండెపోటు వచ్చే అవాకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • శరీరారనికి తగినంత విశ్రాంతి అవసరం. వీలైనంత సేపు నిద్రపోవడానికి సమయం కేటాయించాలి.
  • యువత తమ ఎత్తుకు తగ్గ బరువు(బీఎంఐ)ను మెయిన్​టేయిన్​ చేయాలి. దీని వల్ల ఊబకాయం బారిన పడకుండ మనల్ని మనం కాపాడుకోవచ్చు
  • దురలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లను మానుకోవాలి.
  • యువకులు జిమ్​లో చేరి వ్యాయామాలు చేయాలనుకునే ముందు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
  • డయాబెటిక్​ రోగులను గుండెపోటు సమస్య వేధించే అవకాశాలు ఎక్కువ. 35 ఏళ్లు దాటిన డయాబెటిక్​ పేషంట్లు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
  • మంచి కొలస్ట్రాల్​ను పెంపొందించేందుకు దోహదపడే ఆహారాన్ని తీసుకోవావలి. పళ్లు, కూరగాయలు చిక్కుడ్లు లాంటి గింజ కూరగాయలను తినాలి.
  • డయాబెటీస్​, హైపర్​ టెన్షన్ లాంటివి వేధిస్తున్నప్పుడు వాటిపై ఓ కన్ను వేయాలి. బీపీ ఆపరేటర్లు, షుగర్​ చెకింగ్ మెషిన్లు ఎల్లప్పుడు మనతోనే ఉంచుకోవాలి.
  • ఊబకాయులు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. లేకపోతే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గుండె చుట్టూ చేరుకునే అవాకాశాలున్నాయి.
  • ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వార్షిక శరీర చెకప్​ చేసుకుంటే ఇంకా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
  • పాల పదార్థాల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  • కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉంటే తప్పని సరిగా నిపుణులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
  • తృణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపలు, ఆలివ్​ ఆయిల్​ లాంటి ఆరోగ్యకరమైన పదార్థాలను వాడాలి.

గుండెపోటుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి:

.

ఇదీ చదవండి :ఈ డైట్​ను పాటించండి.. నిండు నూరేళ్లు జీవించండి!

ఆందోళన, ఒత్తిడి వల్ల బీపీ పెరిగిందా?.. అయితే తగ్గించుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details