Weight gain foods: బరువు తగ్గాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారిదో సమస్య అయితే.. బరువు పెరగాలనుకునే వారిది ఇంకో సమస్య. మరీ సన్నగా ఉన్నవారు.. ఆకర్షనీయంగా కనిపించట్లేదని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఏది పడితే అది తింటే లావు అయిపోతారని అనుకోవడం చాలా మందిలో ఉన్న అపోహ! అందుకే, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్, సమోసాలు ఎక్కువగా లాగించేస్తుంటారు. వాటి ద్వారా శరీరంలో కొవ్వు పెరిగి.. లావెక్కుతామని భావిస్తుంటారు. అయితే, అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
జంక్ ఫుడ్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల.. గుండె జబ్బులు వంటివి తలెత్తుతాయని చెబుతున్నారు. అందుకే హెల్తీగా బరువు పెరగడం ఎలాగో సూచిస్తున్నారు.