తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అధిక కొలెస్ట్రాల్​ సైలెంట్ కిల్లర్! - మేల్కోకుంటే అంతే!

High Cholesterol Reducing Tips: ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్‌ పెద్ద సమస్యగా మారింది. చాలా మంది ఈ ప్రాణాంతక సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని పద్ధతులు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

High Cholesterol Reducing Tips
High Cholesterol Reducing Tips

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 1:58 PM IST

High Cholesterol Reducing Tips: ఆధునిక జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో.. ప్రధానమైనది హై కొలెస్ట్రాల్(High Cholesterol). దీనినే సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమే కానీ.. దాని పరిమితి దాటకూడదు. కొలెస్ట్రాల్‌లో కూడా రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. అవి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్.

గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ స్థూలంగా హెచ్‌డీఎల్. రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ రక్తంలోంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి తోడ్పడుతుంది. అలాగే గుడ్​ కొలెస్ట్రాల్​ వల్ల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ స్థూలంగా ఎల్‌డీఎల్‌(LDL)గా పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది రక్త వాహికల్లో పేరుకుపోతుంటుంది. ఫలితంగా రక్త సరఫరా తగ్గిపోవడం లేదా మొత్తానికి ఆగిపోవడం జరుగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు ఎదురౌతాయి. గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను చేర్చే రక్త వాహికల్ని ఎల్‌డీఎల్ బ్లాక్ చేస్తుంటుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా? పరగడుపున ఈ 'ఐదు' ఆకులు తింటే చాలు!

కాగా ప్రస్తుత రోజుల్లో మారిన లైఫ్‌స్టైల్‌, జంక్‌ ఫుడ్‌, సరిగా వ్యాయామం లేకపోవటం, మితిమీరిన తిండి, కూర్చుని ఒకే చోట పనిచేయటం, నిద్రలేమి కారణంగా చెడు కొలెస్ట్రాల్‌‌ పెరుగుతుంది. దీని కారణంగా గుండె సమస్యలు, స్ట్రోక్‌, హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని టిప్స్​ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

హెల్దీ ఈటింగ్:అధిక కొలెస్ట్రాల్​ను తగ్గించడానికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్​ఫుడ్​లను సాధ్యమైనంత మేర తగ్గించాలి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం ముఖ్యం. ఇవి గుండెకు రక్షణగా నిలుస్తాయి. ఆహారంలో ఎక్కువ చేపలు, సాల్మన్, అవిసె గింజలు, వాల్‌నట్‌లను చేర్చుకోవాలి.

అధిక కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - కరివేపాకుతో ఊహించని మార్పు - తేల్చిన రీసెర్చ్!

వ్యాయామం:గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి శారీరక శ్రమ ముఖ్యం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తంలోని సిరల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. వారంలో రెండు రోజులు కనీసం ఓ గంటపాటు వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. చురుకైన నడక, జాగింగ్ వంటి చర్యలు ఎక్కువ ఎఫెక్ట్​ అవుతాయి..

బరువు తగ్గించుకోవాలి:శరీర బరువు పెరుగుతున్న కొద్దీ రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులూ పెరిగే ప్రమాదం ఉంది. హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ ముప్పు ఎక్కువ అవుతాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా బెల్లీ ప్యాట్‌ కరిగించుకోవాలి. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గటంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. 5 % నుంచి 10 % బరువు తగ్గడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు చాలా వరకు అదుపులో ఉంటాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి:ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవనశైలి ఉండాలి. అంటే డ్రింకింగ్​, స్మోకింగ్​ వంటి అలవాట్లు మానుకోవాలి. అలాగే తినే ఆహారాన్ని మితంగా తినాలి. ఎందుకంటే ఇవన్నీ కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!

బజ్జీలు, కారప్పూస, మిక్చర్​ ఎక్కువగా తింటున్నారా?.. అయితే కష్టమే!

ఇవి తింటే చెడు కొలెస్ట్రాల్​కు చెక్!

ABOUT THE AUTHOR

...view details