తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రోజంతా యాక్టివ్​గా ఉండాలనుకుంటున్నారా?.. వీటిని తినేయండి మరి! - డార్క్​ చాక్లెట్​ వల్ల లాభాలు

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మహిళలు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఉరుకుల పరుగుల జీవన శైలిలో తాము కూడా అంతే వేగంగా పరిగెత్తాలనుకుంటారు. అందుకే రోజంతా ఉత్సాహాన్ని తెచ్చుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తింటే చాలంట! అవేంటో చూసేద్దామా?

healthy food tips for good day
healthy food tips

By

Published : Oct 15, 2022, 8:37 AM IST

రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా గడిపేయాలి.. ఇంట్లోవాళ్లకీ సంతోషాన్ని పంచాలని కోరుకోని మహిళ ఉండదు. దానికి యోగా, థెరపీలంటూ ఎన్నెన్నో చేస్తాం కదా! కొన్నిరకాల ఆహార పదార్థాలూ ఆ మ్యాజిక్‌ చేస్తాయట. అవేంటో చూసేద్దమా..!

  • అరటి..దీన్ని గుడ్‌ మూడ్‌ ఫుడ్‌ అంటారు. సంతోషం కలగడానికి కారణం సెరటోనిన్‌ అనే హార్మోన్‌. దీని విడుదలకు అవసరమైన బి6 విటమిన్‌ అరటిలో పుష్కలంగా ఉంటుంది. రోజులో శరీరానికి అవసరమయ్యే బి6 పరిమాణంలో 25 శాతం ఒక అరటి పండు నుంచే లభిస్తుందట. అందుకే రోజుకొకటైనా తినమంటారు పోషకాహార నిపుణులు. కొబ్బరి పాలలోనూ ఆందోళనను తగ్గించే పోషకాలుంటాయి. ఒత్తిడి, ఆందోళనగా అనిపించినప్పుడు ఓ చిన్న ముక్కను తిన్నా ఫలితం ఉంటుంది.
  • డార్క్‌ చాక్లెట్‌..కోపంగా ఉన్న అమ్మాయికి ఒక్క చాక్లెట్‌ ఇచ్చి చూడండి. దెబ్బకు అది మటుమాయం అయిపోతుంది. చాక్లెట్లకీ మనకీ అంత దోస్తీ. తీపి అనే కాదు కానీ నిజంగానే దీనిలో భావోద్వేగాలపై ప్రభావం చూపే పదార్థాలుంటాయి. ఇందులోని అమైనో యాసిడ్‌లు సెరటోనిన్‌ ఉత్పత్తికి సాయపడతాయి. థియోబ్రొమైన్‌ భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుంది.
  • కాఫీ.. ప్రపంచం మొత్తంలో దీన్ని ఇష్టపడే వారి సంఖ్య వంద కోట్లకుపైనే! ఏమాత్రం చిరాకు అనిపించినా వీళ్లంతా కాఫీ తాగడానికి ఇష్టపడతారట. రోజులో మూడు సార్లు మించకుండా తీసుకుంటే డిప్రెషన్‌కీ చెక్‌ పెట్టొచ్చని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.
  • అవకాడో..ఈ కాయంతా పోషకాలే. దీనిలోని కోలైన్‌ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి మనసును తేలిక పరుస్తుంది. దీన్లోని ఆరోగ్యకర కొవ్వులు మహిళల్లో ఆందోళనను తగ్గిస్తాయని ఓ పరిశోధన చెబుతోంది. పెద్ద మొత్తంలో ఉండే విటమిన్‌ బి ఒత్తిడినీ తగ్గిస్తుంది.
  • పులిసిన పదార్థాలు.. ఇడ్లీ, దోశ, పెరుగు, ఆవకాయ.. వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికీ తద్వారా మనసును తేలిక పరచడానికీ ఇవి సాయపడతాయట.

ABOUT THE AUTHOR

...view details