Healthy Fat Foods : ఆహారం.. ఆరోగ్యం.. ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యం పాలవ్వాలన్నా తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మితాహారం తీసుకుంటూ అందుకు తగ్గట్లు వ్యాయామం చేయాలి. ఆధునిక జీవన శైలిలో శారీరక శ్రమ తగ్గటం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల బరువు పెరుగుతాం. తర్వాత కాలంలో లేనిపోని సమస్యలు వస్తాయి.
కొవ్వు అనగానే చాలా మందిలో ఒక చెడు అభిప్రాయం, అపోహలు ఉన్నాయి. కొవ్వు అనగానే బరువు పెరగటం, ఇతర సమస్యలు వస్తాయి అనుకుంటారు. కానీ కొవ్వుల్లో మంచివి, చెడువి రెండూ ఉంటాయి. కొన్ని కొవ్వుల వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. వాటిని మంచి కొవ్వు అంటారు. మరి ఇవి ఎందులో దొరుకుతాయి. ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాల గురించి తెలుసుకుందాం.
Healthy Fat Foods List : ప్రస్తుత కాలంలో పోషకాహారం తీసుకోవడం చాలా తక్కువ. ఉరుకుల పరుగుల జీవితంలో ఏది పడితే అది తినేస్తున్నాం. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువుండే ఆహార పదార్థాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలాంటి బలవర్థకమైన ఆహారం క్రమం తీసుకోవడం ఎంతో అవసరం. తక్కువ కొవ్వు పదార్థాలు తినటం మంచిది. మహిళలకు 20 - 25 గ్రాములు, పురుషులకు 25 -30 గ్రాముల కొవ్వు అవసరం.
మోనో సాచురేటెడ్, పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్‌ను అన్-సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. వీటిని ఆరోగ్యకరమైన కొవ్వులు అంటారు. అవకాడో పండులో మంచికొవ్వులు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల పండును తీసుకుంటే అందులో 18-20 గ్రాముల కొవ్వు ఉంటుంది. దీని వల్ల మంచి కొవ్వులు శరీరానికి అందుతాయి. బార్లీ ఓట్స్లు కొవ్వు పదార్థాల విషయంలో అద్భుతంగా పనిచేస్తాయి. సోయా తక్కువ శాచురేటెడ్ ఫ్యాట్‌ను కలిగి ఉంటుంది.
Healthy Foods Chart : చేపలు తినడం వల్ల శరీరంలోని కొవ్వుస్థాయిలు అదుపులో ఉంచుకోవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కొబ్బరి నూనె, నెయ్యి, అవకాడో, బాదం పప్పు వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆకు కూరల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల సైతం మేలు జరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేపలు తీసుకోవడం వల్ల మంచి కొవ్వు శాతం పెరిగి, చెడు కొవ్వు శాతం తగ్గుతుంది.
ఇవి వద్దు..
సాచురేటెడ్ ఫ్యాట్స్‌ను ఎక్కువగా తీసుకోకూడదు. పండ్లు, కూరగాయలు తక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటాయి. శరీరంలో కొవ్వు స్థాయిలను తగ్గించుకోవడానికి సలాడ్‌లో నిమ్మరసం కలుపుకుని తాగడం చాలా మంచిది. మైదాతో వండే పదార్థాలు, కేకులు, కుకీలు, బిస్కెట్లు, బర్గర్ లాంటి వాటిల్లో ఎక్కువ కొవ్వులు ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకుంటే మరింత హాని కలుగుతుంది. మళ్లీ మళ్లీ ఉపయోగించిన నూనెల వల్ల తయారు చేసిన పదార్థాలు తినటం వల్ల ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. బాగా ప్రాసెస్ చేసిన ఆహారం వల్లా వస్తాయి.
విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఒంటబట్టాలన్నా కొవ్వులు కావాల్సిందే. బాదం పప్పులు తినటం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. మోనో సాచురేటెడ్ కొవ్వులు ఉండే ఆపిల్స్, బ్లూబెర్రీస్, బ్రకోలి, బీన్స్, పాలకూరలను ఎక్కువగా తీసుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ తీసుకునే ఆహారంపై కాస్త శ్రద్ధ పెడితే ఆరోగ్యంగా ఉంటాం!
ఈ 'కొవ్వు' పదార్థాలతో మంచి ఆరోగ్యం మీ సొంతం!