అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్(LDL) అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్(HDL) అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన ఒంటలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై వైద్యులు ఏమంటున్నారు.
Healthy Food: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలా?.. రోజూ వీటిని తినండి! - చెడు కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలు
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి చిట్కాలు
చెడు కొవ్వు తగ్గడానికి చిట్కాలు
- ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి.
- ఎల్‌డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు. ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.
- మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అపోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక పాటించాలి.
- మంచి కొలెస్ట్రాల్ (HDL).. డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి.
- ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- తిండిని అదుపులో ఉంచుకోవాలి.
- కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే నాన్‌వెజ్ ఫుడ్‌ను పరిమిత స్థాయిలో తీసుకోవడం మంచిది లేదా నాన్‌వెజ్ ఫుడ్‌ను పూర్తిగా తినకపోవడం మేలు.
ఇదీ చూడండి:యుక్త వయసులో గుండెపోటు.. కారణాలేంటి?