అంగ స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజ పప్పులు, మసాలాలు, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం, ఆలివ్ నూనె ప్రధానంగా ఉండేలా చూసుకోండి. పాలు, పాల పదార్థాలు, గుడ్లు, ఛీజ్ మితంగా.. మాంసం అరుదుగా తినండి. మిఠాయిలు, తీపి పానీయాలు, ప్యాకెట్లలో అమ్మే మాంసం ఉత్పత్తుల జోలికి అసలే వెళ్లకండి. మధ్యధరా సముద్రం చుట్టుపక్కల దేశాల్లో ఒకప్పుడు తినే ఇలాంటి ఆహార పద్ధతితో పురుషుల్లో స్తంభన లోపం తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ అధ్యయనం పేర్కొంటోంది.
అంగ స్తంభన లోపం ఉందా?- అయితే ఇవి తినండి! - అంగ గట్టిపడటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి
కొందరికి రతిలో ఎక్కువ సమయం పాల్గొనాలని.. ఆ సుఖాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలని ఉంటుంది. శృంగారం చేయాలనే కోరిక మనసులో ఎంత బలంగా ఉన్నా.. కొన్ని సార్లు సాధ్యం కాదు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అంగస్తంభన లోపం కూడా అందులో ఒకటి. అయితే కొన్ని ఆహార పదార్థాలు తింటే.. ఈ లోపం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చుద్దాం..
మధ్యవయసులో అధిక రక్తపోటు, స్తంభన లోపంతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడుతుండటం విశేషం. ఈ ఆహార పద్ధతి రక్తనాళాల పనితీరును మెరుగు పరచటం, టెస్టోస్టీరాన్ తగ్గకుండా చూడటం ద్వారా మేలు చేస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయులు మాత్రమే కాదు.. వ్యాయామ సామర్థ్యమూ ఇనుమడిస్తున్నట్టు తేలింది. ఆహార నియమాలతో పాటు ఉప్పు తగ్గించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిదనీ పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఎవరు చేయించుకుంటే మంచిది?