తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జుట్టు రాలుతోందా?.. దీనితో తలస్నానం చేస్తే సరి! - జుట్టు సమస్యలు

hair loss home remedies: ఈ ఆధునిక సమాజంలో జుట్టు రాలడం అనేది ప్రతి మనిషిలోనూ సర్వసాధారణంగా మారిపోయింది. అలా కాకూడదని చాలా మంది విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. మరి జుట్టు రాలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం?

HEALTH TIPS HAIR FALL
HEALTH TIPS HAIR FALL

By

Published : Jun 20, 2022, 7:03 AM IST

hair loss home remedies: జుట్టు రాలడం అనేది వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగ, చిన్నాపెద్ద, తేడాలేకుండా అందిరిలోనూ సమస్యగా మారిపోయింది. రోజు వెంట్రుకలు రాలినా.. కొత్తవి రావాలి. కానీ రాలిన ప్రదేశంలో కొత్తవి రాకపోతే జట్టు రాలుతుందని భావించవచ్చు. ముఖ్యంగా మహిళల్లో పీసీఓడీ, థైరాయిడ్​, విటమిన్ల లోపం, మానసిక సమస్య, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుటుంది. దీంతో పాటు వాతావరణ పరిస్థితులతో పాటు ఐరన్​ బలహీనత వల్ల కూడా జట్టు రాలిపోతుంటుంది. వీటితో పాటు సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్య తీరిపోతుందంటున్నారు నిపుణులు.

జుట్టు రాలకుండా ఉండాలంటే దీనితో తల స్నానం చేయండి

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:

  • మొలకెత్తిన గింజలు
  • క్యారెట్​, బీట్​రూట్​
  • గుమ్మడి గింజలు
  • పొద్దు తిరుగుడు పువ్వు గింజలు
  • ఆకుకూరలు
  • కూరగాయలు, పండ్ల రసాలు

మూలికా ఔషధం:
జుట్టు రాలకుండా ఉండేందుకు సంప్రదాయ ఔషధాలు సైతం మెరుగ్గా పనిచేస్తాయి. అలాంటి ఔషధాన్ని తయారు చేసేందుకు కావాల్సిన మూలికలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన మూలికలు:

  • కుంకుడుకాయ పొడి
  • ఉసిరి పొడి
  • మెంతుల చూర్ణం
  • మందార చూర్ణం
  • యష్టిమధు చూర్ణం

తయారీ విధానం:మొదట ఓ గిన్నెలో 200 గ్రాముల కుంకుడుకాయ పొడి, 25 గ్రాముల మెంతుల పొడి, ఉసిరి పొడి, యష్టిమధు చూర్ణం, మందార పువ్వుల చూర్ణాన్ని తీసుకుని బాగా కలుపుకోవాలి. దీనిని ఓ గాజు సీసాలో దాచిపెట్టుకోవాలి. అనంతరం స్నానం చేసేముందు స్టవ్​ వెలిగించి కొద్దిగా నీటిని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన మేరకు తయారు చేసుకున్న పొడిని నీటిలో పోసి కలుపుకోని గంటసేపు నానబెట్టుకుని తలకు షాంపూలాగా పెట్టుకోవాలి.

ఇదీ చదవండి:కలయిక కుదరకపోతే మహిళ సర్జరీ చేయించుకోవాలా?

ABOUT THE AUTHOR

...view details