కొందరిలో నెలా నెలా ఠంచనుగా వచ్చే రుతుచక్రం ఒక్కోసారి ముందుగానే వచ్చేయడమో లేదా మరీ ఆలస్యంగా రావడమో జరుగుతుంది. ఇలా అవడానికి కారణాలేంటంటే?
గర్భం.. ధరించిన మహిళల్లో నెలసరి ఆగిపోవడం మొదటి సంకేతం.
మాత్రలు:గర్భనిరోధక మాత్రలు వాడినప్పుడు కూడా అప్పుడప్పుడూ నెలసరి అదుపు తప్పుతుంది.
పాలిచ్చే తల్లులు:బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో కూడా నెలసరి చాలా రోజుల పాటు ఆగిపోతుంది. బిడ్డ ఎప్పుడైతే పాలు తాగడం ఆపేస్తాడో అప్పుడే నెలసరి మొదలవుతుంది.
అనారోగ్యాలు: థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో కూడా ఇది ఆలస్యంగా లేదా తొందరగా రావడం జరుగుతుంది. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), మూత్రాశయంలో రాళ్లు, బుడగల్లాంటివి ఉండటం, ఎండోమెట్రియాసిస్ లాంటి అనారోగ్యాల వల్ల క్రమం తప్పుతుంది.