Fiber Side Effects on Health :మీ శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఫైబర్ ఒకటి. ఎందుకంటే ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అలాగే డైటీషియన్లు ఎప్పుడూ దీనిని ఎక్కువగా తినమని చెబుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది ఫైబర్ అధిక మొత్తంలో తీసుకుంటే హెల్త్‌కు(Health)మంచిదని భావిస్తారు. కానీ, డైలీ దీనిని అవసరానికి మించి తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే. కానీ, దాని పరిమితికి మించి తీసుకుంటే మంచిది కాదు. నిపుణుల సిఫార్సు చేసిన దాని ప్రకారం.. మహిళలు రోజుకు 25 గ్రాములు, పురుషులు రోజుకు 38 గ్రాములు తీసుకోవాలి. అయినప్పటికీ, 95 శాతం మంది ప్రజలు తమ ఆహారంలో ఇంత ఫైబర్ తీసుకోవట్లేదని కొంతమంది నిపుణుల అంచనా. యాపిల్స్, బ్రోకలీ, బెర్రీలు, అవకాడోలు, పాప్‌కార్న్, తృణధాన్యాలు, ఎండిన పండ్లు, ఓట్స్, అరటిపండ్లు, క్యారెట్లు, దుంపలు, టమోటాలు వంటి ఆహార పదార్థాలలో వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
మీరు బరువు తగ్గాలని లేదా ఉన్న దానిని కొనసాగించాలనుకున్నట్లయితే.. ఏ డైటీషియనైనా మీ జీర్ణవ్యవస్థ సజావుగా జరిగేలా పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సిఫారసు చేస్తారు. కానీ, వారు సూచించిన పరిమాణం కంటే ఎక్కువ తినడం లేదా ఒక్కసారిగా ఫైబర్ తీసుకోవడం చేసినా కొన్ని అనారోగ్య సమస్యలు మీరు ఎరికోరి తెచ్చుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, ఆ సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..
తిన్న తర్వాత కూల్‌డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!
గ్యాస్, ఉబ్బరం : మీ రోజువారీ ఆహారంలో ఎక్కువ ఫైబర్ తీసుకుంటున్నట్లయితే.. అది తీవ్రమైన గ్యాస్, కడుపు ఉబ్బరంతో సహా అసౌకర్య జీర్ణాశయ సమస్యలను కలిగిస్తుంది. అందుకే పోషకాహార నిపుణులు మీ డైట్లో.. నెమ్మదిగా క్రమంగా దీని మొత్తాన్ని పెంచాలని సిఫార్సు చేస్తారు.