Health Problems Due to Late Night Dinner: బిజీ లైఫ్‌స్టైల్, లేట్ నైట్ జాబ్స్, పార్టీలు, ఫంక్షన్లు.. ఇలా పలు కారణాలు చూపుతూ.. చాలా మంది రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తూ ఉంటారు. మరికొంత మంది రాత్రి పూట ఆలస్యంగా తినడాన్ని ఓ అలవాటుగా చేసుకుంటారు. కానీ.. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
రాత్రి సమయంలో లేట్‌గా భోజనం చేయడం వల్ల.. మలబద్ధకం, గ్యాస్, రక్తంలో చక్కెర పెరగడం, గుండె జబ్బులు వంటి అనేక అరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగితే.. ఆరోగ్యం పూర్తిగా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
పడుకునే ముందు చేసే ఈ పొరపాట్లే - అధిక బరువు కారణం!
జీర్ణక్రియ సమస్యలు:రాత్రిపూట మన ఆహారపు అలవాట్లు.. జీర్ణక్రియపై చాలా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. రాత్రి వేళ లేట్‌గా భోజనం చేసే వాళ్లు.. ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా వెళ్లి పడుకుంటారు. భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
బరువు పెరుగుతారు:రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల.. శరీరంలో జీవక్రియ మందగిస్తుంది. జీవక్రియ నెమ్మదిగా ఉంటే.. కేలరీలు సరిగ్గా బర్న్ కావు. దీంతో.. శరీరంలో ఫ్యాట్ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి.. భోజనానికి, నిద్రపోవడానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.