తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే మేలు? - భార్య భర్తల మధ్య బంధం

భార్యాభర్తల మధ్య చక్కని బాంధవ్యం ఉండటం అవసరం. అయితే ఈ బాంధవ్యం ఏర్పడటానికి ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా అడ్డొస్తుందా? వయసు తేడా ఎక్కువ ఉంటే శృంగార సమస్యలు తలెత్తుతాయా? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

health experts
భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉంటే మేలు?

By

Published : Nov 9, 2021, 8:00 AM IST

భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువ ఉండకపోవడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అలా ఉండటం వల్ల ఇద్దరి మధ్య రిలేషన్​ షిప్​ సమస్యలు మొదలవుతాయని.. ఇద్దరి మధ్య స్నేహం కుదరదని తెలిపారు. వయసు తేడా రెండు నుంచి నాలుగు సంవత్సరాలకు మించి ఉండకూడదని సూచించారు. ఒకవేళ ఉంటే ఆ భార్యకు ఆమె భర్తను చూస్తే ఓ పెద్దాయనలా కనపడతారని.. ఒకసారి ఆ ఫీలింగ్​ వస్తే భర్తతో రొమాంటిక్​గా ఉండటం కష్టమని అభిప్రాయపడ్డారు. 'రొమాంటిక్​ లైఫ్​ ఉండాలంటే రొమాంటిక్​ థాట్​ ఉండాలి, రొమాంటిక్​ టచ్​ ఉంటాలి, రొమాంటిక్​ ఫీలింగ్​ ఉండాలి.. అప్పుడే శృంగారం కూడా పండుతుంది' అని చెప్పుకొచ్చారు.

ఒక పెద్దాయన అని అనిపించాక అసలు ఫీలింగ్సే రావని.. కాబట్టి శృంగారపరంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వయసు తేడా ఎక్కువ ఉండకూడదని స్పష్టం చేశారు. వయసు తేడా ఎక్కువ లేనప్పుడే ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోగలరని తెలిపారు.

ఇదీ చూడండి :ఒక్క వీర్యపు బొట్టు.. వంద రక్తపు చుక్కలతో సమానమా?

ABOUT THE AUTHOR

...view details