కడుపునొప్పి తరచూ వస్తే దానిని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరిపడా నిద్ర, సమయానికి ఆహారం తీసుకోకపోవడం కూడా కడుపునొప్పికి కారణం అవొచ్చు అని వెల్లడించారు. రోజుకు కనీసం 5-6 గంటలు నిద్ర ఉండాలని స్పష్టం చేశారు. ఇవి కాకుండా విటమిన్ లోపాలు.. విటమిన్ బీ12, బీ9, డీ వీటిల్లో ఏమైనా లోపాలు ఉన్నా.. ఐరన్ డెఫీషియన్సీ ఉన్నా.. కడుపు ఉబ్బుతుంది. దీని వల్ల బొడ్డుకు పైభాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
తరచూ కడుపునొప్పి రావడం.. దానికి సంకేతమేనా? - abdominal pain causes
కొందరిలో కడుపునొప్పి భరించరాని సమస్యగా మారుతుంది. తరచూ నొప్పి రావడం తీవ్ర అస్వస్థతకు దారితీస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏంటి? ఈ సమస్యపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
![తరచూ కడుపునొప్పి రావడం.. దానికి సంకేతమేనా? కడుపునొప్పి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15838513-thumbnail-3x2-dd.jpg)
ఈ లోపాల వల్ల ఒక్కోసారి భుజం నొప్పి కూడా రావొచ్చని .. ఛాతీ మంట కూడా ఉంటుందన్నారు. అయితే ఇవన్నీ గుండెకు సంబంధించి సమస్యలని భావిస్తారని కానీ అలాంటిదేమీ ఉండదని అది కేవలం గ్యాస్ట్రైటిస్ అని స్పష్టం చేశారు. అప్పర్జీ ఎండోస్కోపీ చేయించుకుంటే పరీక్షతో కడుపులో అల్సర్స్, గ్యాస్ట్రోపతి వంటి సమస్యలు ఏమున్నా తెలుస్తాయని సూచిస్తున్నారు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకుంటే గనుక గాల్బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయో లేదో కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. వీటిలో ఏ సమస్య ఉన్నా ఇలా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చూడండి :ఈ భయాల్ని పక్కనపెడితేనే.. మీ 'శృంగార జీవితం' మరింత మధురం!