Female Sex Problems: శృంగారంలో పాల్గొనేటప్పుడు భార్యాభర్తలిద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయి తీయని అనుభూతుల్లో తేలియాడుతుంటారు. రతిలో ఎక్కువ సేపు పాల్గొనాలని వారు రకరకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే వేడి చేస్తుందని భావిస్తుంటారు. ఇలా కొంత మంది ఆడవాళ్లలో ఉన్న అపోహలు వారి సెక్స్ బలహీనతల్ని బయటపెడుతుంటాయి. వీటిని అధిగమించి వారు శృంగార జీవితాన్ని ఆస్వాదించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంటే వేడి చేస్తుందా? - శృంగార సమస్యలు
Female Sex Problems: శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని దంపతులు ఆశిస్తుంటారు. కానీ, మహిళల్లో ఉండే కొన్ని సమస్యలు వారి సెక్స్ జీవితానికి అడ్డంకిగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ బలహీనతల్ని అధిగమించడం ఎలానో తెలుసుకుందాం.
![ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంటే వేడి చేస్తుందా? Female Sex Problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15314556-432-15314556-1652835011675.jpg)
శృంగారం చేసుకుంటే వేడి చేస్తుందనే భావనే తప్పు. శృంగారం సమయంలో యోని మార్గంలో రాపిడి జరిగి మంట పుడుతుంది. ఇలా ఎక్కువ సేపు పాల్గొన్నపుడు మూత్రం వచ్చే నాళానికి రాపిడి జరిగి మంట వస్తుంది. యోని, మూత్ర నాళం దగ్గరగా ఉండటం వల్ల రాపిడి జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే లూబ్రికెంట్స్, జెల్స్ రాసుకోవాలి. ఇవి ఉపయోగించి సెక్స్‌లో పాల్గొంటే ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఇది వ్యాధి కాదు. ఇన్ఫెక్షన్ కాదు. ఇది కేవలం రాపిడి వలనే వచ్చే సమస్య మాత్రమే. దీని గురించి ఆలోచించకుండా హాయిగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఇంకా అపోహగా ఉంటే మూత్ర పరీక్ష చేయించుకోండి.
ఇదీ చదవండి:కామెర్లు ఉన్నవారితో సెక్స్ ప్రమాదకరమా?