తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అరటిపండు ఏ టైమ్​లో తినాలి?.. పరగడుపున తింటే ప్రమాదమా? - అరటిపండు బెనిఫిట్స్​

What Is Banana Time : రోజూ చాలా మంది అరటిపండును తింటూ ఉంటారు. కొంతమందికి అరటిపండు ఏ సమయంలో తీసుకోవాలనే గందరగోళం ఉంటుంది. అసలు అరటిపండు ఏ సమయంలో తినాలో, తినకూడదో తెలుసుకుందాం.

Banana Which Time To Eat
Banana Which Time To Eat

By

Published : Jul 17, 2023, 8:42 AM IST

Banana Which Time To Eat : కొన్ని పండ్లు సీజన్‌కు తగ్గట్లు మార్కెట్‌లోకి వస్తూ ఉంటాయి. కానీ అరటిపండ్లు ఏడాది మొత్తం ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటాయి. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉండటం, రుచికరంగా ఉండటం, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల అరటిపండ్లను ఎక్కువమంది తరచుగా తింటుంటారు. కొంతమంది విడిగా తింటే.. మరికొంతమంది తమ ఆహారంలోనే భాగం చేసుకుని మరీ వీటిని తింటారు. అరటిపండ్లలో శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, అమినో యాసిడ్, ట్రిప్టోపాన్ లాంటి పదార్థాలు ఉంటాయి. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి సహాయపడతాయి. అయితే అరటిపండును ఉదయం తినవచ్చా? రాతిపూట తింటే మంచిదా? అనే అనుమానాలు చాలామందిలో ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?

ఉదయం లేదా సాయంత్రం..
అరటిపండ్లను ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం చాలా మంచిదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట జీవక్రియ అత్యల్పంగా ఉంటుంది. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నిద్రను నియంత్రించే సెరోటోనిన్‌ అనే పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే రాత్రి తింటే శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల దగ్గు ఉన్నవారు రాత్రి తీసుకోకూడదు. అరటిపండును ఉదయం లేదా సాయంత్రం తీసుకుంటేనే ఎక్కువ లాభాల ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

పరగడుపున తినకూడదు..
అయితే కొంతమంది పరగడుపున లేదా ఎలాంటి ఆహారం తీసుకోకముందు అరటిపండును తీసుకుంటారు. అలా తినడం మంచిది కాదట. ఇవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే ప్రేగులను చికాకు పెడతాయి. దీంతో ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది.

అల్పాహారంలో భాగం చేసుకుని..
ఉదయం అల్పాహారం సమయంలో అరటిపండును తీసుకోవడం మరింత మంచిది. ఉదయం ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల రోజంతా చక్కెర, సూక్ష్మపోషకాలను శరీరం ఉపయోగించుకుంటుంది.

పచ్చ అరటిపండు వల్ల ఉపయోగాలెన్నో..
Green Banana Benefits : అరటిపండులో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో పచ్చ అరటిపండు తీసుకోవడం వల్ల ప్రత్యేక లాభాలున్నాయి. పచ్చి అరటిపండు ఫైబర్‌లా పనిచేస్తుంది. ఇది ప్రేగు చలనానికి సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆందోళనను తగ్గించే గుణాలు
అరటిపండులో అమైనో యాసిడ్, ట్రిప్టోఫాన్‌ను ఉంటాయి. ఇవి సెరోటోనిన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇవి ఆందోళనను తగ్గించి యాంటీ డిప్రసెంట్‌గా పనిచేస్తాయి. దీంతో అరటిపండును తరచుగా తీసుకోవడం వల్ల ఆందోళన సమస్యల నుంచి బయటపడవచ్చు.

తక్షణ శక్తి
Banana Instant Energy : బాగా పండిన అరటిపండులో స్టార్చ్ పూర్తిగా విరిగిపోతుంది. దీని వల్ల వాటిల్లో తీపి ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని శరీరానికి అందిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details