తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Health benefits: చిటికెడు వాముతో ఇన్ని లాభాలా? - వాము ఔషధ గుణాలు

ఆహారంలో రుచి కోసం ఉపయోగించే వాము వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడం సహా అజీర్తి తగ్గుముఖం పడుతుంది. వీటితో మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

vaamu
చిటికెడు వాముతో ఎన్నో లాభాలు

By

Published : Oct 20, 2021, 5:22 PM IST

చిరుతిళ్లు, పిండివంటలు ఏవి తయారుచేసినా అందులో చిటికెడు వాము వేయాల్సిందే. ఇది ఆహారానికి రుచితోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..

  • వాములో ఔషధ గుణాలెక్కువ. విరేచనాలతో బాధపడుతున్నవారు వాము నీళ్లను తాగితే ఉపశమనంగా ఉంటుంది.
  • వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
  • దీన్ని చిన్నా, పెద్దా అందరూ తినొచ్చు.
  • వాము పొడితో దంతాలను శుభ్రం చేసుకుంటే చిగుళ్లు బలంగా మారతాయి.
  • జలుబుతో బాధపడేవారు వామును ఓ వస్త్రంలో కట్టి వాసన పీలిస్తే ఉపశమనంగా ఉంటుంది.
  • అన్నంలో వాము పొడిని వేసుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
  • వాము రసాన్ని మజ్జిగలో కలిపి తాగితే అతిసారం, అజీర్తి తగ్గుముఖం పడతాయి.
  • మూత్ర సంబంధ సమస్యలను నియంత్రిస్తుంది. పుల్లటి తేన్పులను తగ్గిస్తుంది.
  • కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే సమస్య తగ్గుతుంది.
  • గ్యాస్‌ ట్రబుల్‌తో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడగట్టి వేడి వేడిగా తాగితే పొట్టలోని గ్యాస్‌ తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఈ పొడిని నమిలితే కూడా గ్యాస్‌ తగ్గిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details