తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వెల్లుల్లి తింటే తగ్గే రోగాలు ఇవే.. - వెల్లుల్లితో ఆరోగ్య లాభాలు

వెల్లుల్లిని చాలా కూరల్లో.. పచ్చళ్లులో తప్పనిసరిగా వాడుతుంటారు. దీనిని వాడటం వల్ల రుచి మాత్రమే కాదు.. అంతకుమించి లాభాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వెల్లుల్లి వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.

Health benefits of Garlic
వెల్లుల్లి ప్రయోజనాలు

By

Published : Aug 30, 2021, 4:00 PM IST

వెల్లుల్లి.. దీనిని తినడం వల్ల కలిగే లాభాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వెల్లుల్లిని ఎన్నో ఔషధాల తయారీల్లో వాడుతుంటారు. దీనిని తినడం వల్ల నయం అయ్యో రోగాలు ఎన్నో ఉన్నాయి. వెల్లుల్లి తినడం వల్ల తగ్గే రోగాలు ఏంటి? దానిలో ఉండే ఔషధ గుణాలేంటో..? నిపుణుల మాటల్లో...

  • వాత దోషం తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది.
  • పలు రకాల నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
  • జీర్ణ మండలంలో చేరే రకరకాల బ్యాక్టీరియాలను నిరోధించే శక్తి వెల్లుల్లికి ఉంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • కొలెస్ట్రాల్, ఆస్తమా, కీళ్ల నొప్పులు తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థలోని ఇతర సమస్యలను పరిష్కరించడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
  • దగ్గు, ఆయాసం ఉండి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడే వారికే దివ్య ఔషధంలా ఉపయోగపడుతుంది. (3/4 వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి.. పేస్టులా చేసుకుని ఒక్క కప్పుడు పాలకు.. 4 కప్పుల నీళ్లు యాడ్​ చేసి అందులో ఒక స్పూన్​.. దంచిన వెల్లుల్లి పేస్ట్​ను వేసి పాలు మాత్రమే మిగిలేలా వేడి చేయాలి. వాటిని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి)
  • న్యూమోనియా, టీబీ ఉన్నవాళ్లు ఔషధాలతో పాటు వెల్లుల్లితో కాచిన పాలను తాగడం వల్ల కఫాన్ని తగ్గిస్తుంది.
  • రోజూ ఆహారంతో కలిపి తీసుకోవాలి. అయితే పచ్చిగా తినడం మంచిది కాదు. నువ్వుల నూనెలో వేడి చేసి తీసుకోవాలి.
  • పింపుల్స్​ ఉండేవాళ్లు తొక్క తీసిన వెల్లుల్లి చొనతో వాటిపై రుద్దినట్లయితే కురుపులు తగ్గే అవకాశం ఉంది.
  • చెవిపోటు ఉన్నవారు.. వెల్లుల్లిని పేస్టులా చేసి.. దానిని నువ్వుల నూనెలో వేయించాలి. తర్వాత ఆ నూనె గోరు వెచ్చగా అయిన తర్వాత ఇయర్​ డ్రాప్స్​లా చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
  • ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా రకరకాల ఇన్‌ఫెక్షన్లకు చెక్‌ పెడుతుంది. దగ్గు, జలుబులను దరి చేరనీయదు.
  • శరీరానికి వేడి చేసే గుణం వెల్లుల్లిలో అధికంగా ఉంటుంది. ఎక్కువగా వేడి చేసేవారు, కడుపులో మంట ఉన్నవారు దీనిని వాడకపోవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details