Health Benefits Of Dates : రుచికరమైన డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరాలు ఒకటి. వీటిలో తాజా పళ్ల కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. పిండి పదార్థాలు, ప్రొటీన్లతో పాటు మనకు చాలా అత్యవసరమైన కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, పీచును ఖర్జూరాల ద్వారా పొందొచ్చు. మన శరీరంలోని కణాలకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో పుష్కలంగా లభిస్తాయి.
ఎండిన ఖర్జూరాల్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల ఖర్జూరంలో 75 గ్రాముల వరకు పిండి పదార్థాలే ఉంటాయి. పీచు 7 గ్రాములు, ప్రొటీన్ 2 గ్రాములు లభిస్తాయి. ఇక పొటాషియం, కాపర్, మాంగనీస్, ఐరన్, విటమిన్ బీ6 లాంటి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా పొందవచ్చు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మనకు ఆనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. మనం తరచూ ఖర్జూరం తినడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి..
Dates Benefits For Skin :యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలకు జరిగే హానిని తగ్గించి చాలా రకాల వ్యాధులను నివారిస్తాయి. ఎండు ఖర్జూరాలను ఇతర డ్రై ఫ్రూట్లతో పోల్చినప్పుడు వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరింత ఎక్కువగా ఉంటాయి. కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఖర్జూరం రక్షిస్తుంది. ఖర్జూరం క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
గర్భిణులకు సూపర్ ఎనర్జీ..
Benefits Of Dates For Women : ఖర్జూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, విటమిన్ సీ, విటమిన్ డీతో పాటు విటమిన్ బీ కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. కనుక ఇది గర్భిణులకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. దీంట్లో ఉండే పోషకాలు మన జుట్టు, చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
వాటిని కాపాడతాయి..
Dates Benefits :ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలు, కణజాలాలను పాడవకుండా కాపాడతాయి. అలాగే క్యాన్సర్ కారకాలను తొలగించడంలోనూ సాయపడతాయి. మన రోజువారీ జీవితంలో తీపి ఎక్కువగా ఉండే మిఠాయిలను పక్కనపెట్టి వాటికి ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయని డాక్టర్లు చెబుతున్నారు.
మల్లబద్ధకాన్ని మాయం చేస్తుంది..
Dates Benefits In Telugu : ఖర్జూరాల్లో పీచు శాతం కూడా అధికంగానే ఉంటుంది. పీచు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఎండు ఖర్జూరాలు తిన్నవారిలో మలబద్ధకం సమస్య లేకపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. పీచు రక్తంలో చక్కెర స్థాయులను కూడా అదుపులో ఉంచుతుంది. పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నిదానించి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది..
ఖర్జూరం తినడం వల్ల మన మెదడుకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇవి మెదడు క్షీణతను తగ్గించి అనారోగ్యాలను నివారిస్తాయి. వీటిని తినడం వల్ల నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని.. ఆందోళన తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా ఖర్జూరాల్లో గర్భిణులకు ప్రసవం సులువుగా అయ్యేందుకు తోడ్పడే లక్షణాలు ఉంటాయి. అయితే వైద్యుల సలహా మేరకు గర్భిణులు వీటిని తీసుకోవడం మంచిది.
ఖర్జూరాల్లో మూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని కెరిటినాయిడ్స్, ఫ్లేవినాయిడ్స్, ఫెలోనిక్ యాసిడ్స్గా చెప్పొచ్చు. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కెరిటినాయిడ్స్ దోహదపడతాయి. మన శరీరంలో ఎక్కడైనా వాపు ఏర్పడితే దాన్ని తగ్గించడానికి ఫ్లేవినాయడ్స్ సాయపడతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఫెలోనిక్ యాసిడ్స్ చాలా ఉపయోగపడతాయి.
ఎముకలను మరింత దృఢంగా..
ఖర్జూరాల్లో సహజ చక్కెర ఫ్రక్టోస్ ఉంటుంది. అందుకే ఇవి తీయ్యగా ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉన్నాయి. కనుక ఖర్జూరాలను పంచదారకు ప్రత్యామ్నాయంగా ఆహారాల్లో వాడవచ్చు. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువే గనుక మితంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరాల్లో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇవి ఎముకులను దృఢంగా ఉంచుతాయి.
సంతానలేమి సమస్యను నివారిస్తుంది..
Dates Benefits For Men Sexually : ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాలను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తగిన పోషకాలను పొందవచ్చు. క్రమంగా వాటి మోతాదును పెంచుకోవచ్చు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల ఉదయం పూట తినడం మంచిది. దీని వల్ల రోజంతా కడుపు నిండిన భావన కలుగుతుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు చిరుతిండిగా కూడా డేట్స్ను తినవచ్చు.