ఆఫీసైనా, ఇళ్లయినా పైఅంతస్తులకు వెళ్లడానికి ఎక్కువమంది ఉపయోగించుకునే మార్గం లిఫ్టు. కేవలం ఇక్కడే కాదు.. షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వెళ్లినప్పుడు కూడా మెట్లకు బదులుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉపయోగిస్తాం. రోజులో కొన్నిసార్లయినా మెట్లు ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో అనవసర క్యాలరీలు కరిగి, బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణుల అభిప్రాయం. అంతే కాదు.. మెట్లెక్కడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయి..
ఎంతసేపు?
అటు ఆరోగ్యంగా, ఇటు ఫిట్‌గా ఉండాలంటే వారానికి మూడు నుంచి ఐదు రోజులు.. రోజూ కనీసం అరగంట పాటు మెట్లెక్కే వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామం చేసేటప్పుడు కూడా షూ ధరించడం చాలా మంచిది. అయితే ఇవి మడమ భాగంలో మందంగా, మెత్తగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇలా సౌకర్యవంతంగా ఉంటే మెట్లెక్కినా పెద్దగా ఇబ్బంది ఎదురవకుండా ఉంటుంది.
దృఢమైన కండరాలకు..
శరీరంలోని కండరాలు దృఢంగా, మంచి ఆకృతిలో ఉంటేనే శారీరక దారుఢ్యం సొంతమవుతుంది. మరి ఇది సాధ్యం కావాలంటే రోజూ మెట్లెక్కాల్సిందేనంటున్నారు నిపుణులు. చాలామంది తొడలు లావుగా ఉండి.. మిగిలిన శరీరమంతా నార్మల్‌గా ఉంటుంది. అలాంటి వాళ్లకు రోజూ మెట్లెక్కడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి. మెట్లెక్కే క్రమంలో శరీర బరువంతా మోకాళ్లు, తొడ కండరాలపైనే ఎక్కువగా పడుతుంది. దీంతో ఆయా భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడంతో పాటు కండరాలు కూడా దృఢంగా మారతాయి. కాబట్టి మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి కూడా మెట్లెక్కే వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది.
క్యాలరీల ఖర్చు..