Health Benefits of Black Turmeric : పసుపులో ఎన్నో జౌషధ గుణాలుంటాయని మనందరికీ తెలిసిన సంగతే. దీంతో ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే అందరం డైలీ వండే అన్ని రకాల వంటకాల్లో పసుపును యూజ్ చేస్తుంటాం. ఇది వంటలకు రంగు, రుచిని ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదే విధంగా పసుపులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో ఇది అనేక వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తోంది. అయితే ఇంత వరకు ఓకే గానీ.. మీరు నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది మామూలు పసుపు(Turmeric) కంటే అధిక కర్‌క్యుమిన్ కంటెంట్‌తో పాటు అనేక ఔషధ విలువలు కలిగి ఉంది. దీనిని కనుక మీ వంటలో భాగం చేసుకున్నారంటే సాధారణ పసుపు కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Black Turmeric Benefits :సాధారణంగా మనం పసుపును వంటల్లో వేసుకుంటే అది పసుపు రంగులోకి మారుతుంది. అలాగే ఈ నల్ల పసుపు మీ ఆహార పదార్థాల్లో లేదా పాలలో వేసుకున్నప్పుడు అవి నలుపు రంగులోకి కాకుండా ఊదా రంగులోకి మారుతాయి. పేరుకే నలుపు కానీ.. దాని కలర్ ఊదా రంగులో ఉంటుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్‌లో ఈ నల్ల పసుపును పండిస్తారు. కర్కుమా సీసియా.. ఈ పసుపు శాస్త్రీయ నామం. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఇప్పుడు బయట మార్కెట్లో, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది. ఇక దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్ : నల్ల పసుపును యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది గాయాలు, దెబ్బల వల్ల బాడీలో వచ్చిన వివిధ వాపుల్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి వాటికీ ఈ పసుపు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తంగా దీనిని మంచి సహజ నొప్పి నివారణిగా చెప్పుకోవచ్చు.
మెరుగైన రోగనిరోధక వ్యవస్థ : నల్ల పసుపులోని కర్కుమినాయిడ్స్ రోగనిరోధక కణాల కార్యకలాపాలను ప్రేరేపిస్తాయి. అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడడానికి అవి రక్షణ కవచంగా పనిచేస్తాయి. ముఖ్యంగా నల్ల పసుపును తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు.. వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు వంటి వాటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : నల్ల పసుపు తీసుకోవడం ద్వారా మెరుగైన జీర్ణ వ్యవస్థ మీ సొంతమవుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫలితంగా అల్సర్లు, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలన్నీ తగ్గి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. పోషకాల శోషణకు సహాయపడుతుంది.
మీరు వంటల్లో వాడుతున్న పసుపు కల్తీ కావొచ్చు - ఇప్పుడే చెక్ చేసుకోండిలా!