తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బీట్‌రూట్‌ తింటున్నారా? - health benefits of beetroot

మనలో చాలామంది ‘అది తినను, ఇది తినను’ అంటుంటారు. ఆ జాబితాలో చేదుగా ఉండే కాకరతో పాటు తియ్యగా ఉండే బీట్‌రూట్‌ కూడా ఉంటుంది. అయితే బీట్‌రూట్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుంటే దీన్ని ఇష్టపడనివారు కూడా ఇక మీదట మనసు మార్చుకోవాల్సిందే!

health benefits of beetroot
బీట్‌రూట్‌ తింటున్నారా?

By

Published : Oct 28, 2020, 2:29 PM IST

బీట్‌రూట్‌లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
* ఇందులో ‘విటమిన్‌ సి’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
* పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
* దీన్లో ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని అదనపు కొవ్వుని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇందులో కెలొరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సరైన ఆహారమిది.
* ఈ దుంపలో విటమిన్‌-బి ఉంటుంది. ఇది జీవక్రియ, నాడీ వ్యవస్థల పనితీరు మెరుగవడానికి సహాయపడుతుంది.

ABOUT THE AUTHOR

...view details