తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Beetroot benefits: బీట్​రూట్​తో బోలెడన్ని లాభాలు!

తక్కువ వయసులోనే బీపీ, ఒబెసిటీ, డయాబెటీస్​ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. అటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు ఆరోగ్యకరమైన, ఔషధగుణాలున్న దుంపజాతి ఆహారం బీట్​రూట్​ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అది తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Beetroot benefits
బీట్​రూట్​తో ప్రయోజనాలు

By

Published : Aug 26, 2021, 4:00 PM IST

శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందించే దుంపల జాబితాలో బీట్​రూట్​ ఒకటి. అయితే దీనిని తినేందుకు అంత సామాన్యంగా ఎవరూ ఇష్టపడరు. తినగానే నాలుక, దంతాలు ఎర్రగా మారి భయంకరంగా కనిపించే ఈ దుంపజాతిలో చెప్పలేనన్ని పోషకాలు నిండి ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియక.. చాలా మంది అయిష్టత ప్రదర్శిస్తారు. బీట్​రూట్​తో ఆరోగ్య ప్రయోజనాలు ఎలాంటివో ఇప్పుడు చూసేద్దాం.

బీట్​రూట్​, క్యారెట్ లాంటివి శరీరానికి చక్కటి ఔషధంలా పని చేస్తాయి. బీట్​రూట్​.. ఎన్నో పోషకాలు అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తశాతాన్ని పెంచుతుంది. కొందరు ఈ బీట్​రూట్​ను ఆహారంగా తినేందుకు అయిష్టత ప్రదర్శిస్తారు. దీనిని తినవచ్చు. జ్యూస్​గా చేసి తాగవచ్చు. కూరగా వండుకోవచ్చు. బీట్​రూట్​ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

బీట్​రూట్​తో ప్రయోజనాలు(Beetroot benefits)

  • డయాబెటిక్​ రోగులు బీట్​రూట్​ను తీసుకుంటే లివర్​ సంబంధిత సమస్యలు తలెత్తవు.
  • బీట్​రూట్​లో నైట్రేట్లుతో పాటు విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు దండిగా ఉంటాయి.
  • బీట్​రూట్​లో నైట్రేట్ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్​లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తాయి.
  • శరీరం కాల్షియాన్ని వినియోగించుకోవడంలో బీట్​రూట్​ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • దీనిని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ఐరన్​ అందుతుంది. తద్వారా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.
  • అలాగే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్​ను తీసుకోవడంలో తోడ్పడుతుంది.
  • బీట్​రూట్​లోని నెట్రైట్​.. మెదడు పని తీరును మెరుగుపరిచి, శక్తిమంతంగా మార్చగలదు.
  • ఇందులో ఉండే శక్తిమంతమైన లైకోపిన్​ అనే యాంటిఆక్సిడెంట్​ వృద్ధాప్య ఛాయలు ధరి చేరనీయకుండా కాపాడుతుంది.
  • బీట్​రూట్​లో విరివిగా లభించే కెరోటినైట్స్​ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.
  • బీట్​రూట్​కు ఎరుపురంగును కలిగించే బీటాసైయానిన్​కు పెద్దపెగుల్లో క్యాన్సర్​తో పోరాడే లక్షణం ఉంది.
  • శరీరానికి కావాల్సిన బీ, సీ విటమిన్లు బీట్​రూట్​లో పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు పలు రకాల క్యాన్సర్​ నివారిస్తుంది.
  • రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

ఇదీ చూడండి: ​healthy food: ఇలా చేస్తే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు చెక్​!

ABOUT THE AUTHOR

...view details