తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2020, 10:30 AM IST

ETV Bharat / sukhibhava

అరటితో గుండె ఆరోగ్యం అదుర్స్!

గుండెకు అరటి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. అరటిపండ్లు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బు ముప్పు 27 శాతం తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

health benefits of  banana is especially good for heart
అరటితో గుండె ఆరోగ్యం అదుర్స్!

గుండె ఆరోగ్యానికి.. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణకు పొటాషియం అత్యావశ్యకం. ఇంత కీలకమైనదైనా చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆహారం ద్వారా దీన్ని పొందటం పెద్ద కష్టమేమీ కాదు. అరటిపండ్ల మీద దృష్టి పెడితే చాలు. మామూలు సైజు అరటిపండు ఒకటి తిన్నా రోజుకు అవసరమైన పొటాషియంలో 9 శాతం లభించినట్టే.

అందుకే అరటిపండ్లు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బు ముప్పు 27 శాతం తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అరటి పండ్లలో పొటాషియం ఒక్కటే కాదు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం కూడా ఉంటుంది. డొపమైన్‌, క్యాటెచిన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లూ దండిగా ఉంటాయి. విశృంఖల కణాల అనర్థాలను తగ్గించే ఇవీ గుండె ఆరోగ్యానికి తోడ్పడేవే. డొపమైన్‌ అనగానే హుషారును కలిగించే రసాయనంగానే గుర్తుకొస్తుంది. కానీ అరటిలోని డొపమైన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది.

ఇదీ చదవండి: అరటికాయ పిండితో ఎన్నో లాభాలున్నాయండి!

ABOUT THE AUTHOR

...view details