తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Health tips: బొప్పాయితో చర్మం నిగారింపు.. అనారోగ్య సమస్యలకు చెక్​.!

కంటికి ఇంపైన రంగు, తియ్యని రుచితో నోరూరిస్తుంది బొప్పాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది. మరి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా.!

health benefits with papaya
బొప్పాయితో ఆరోగ్యం

By

Published : Aug 6, 2021, 12:31 PM IST

మనం రోజూ తినే ఆహారంలో బొప్పాయిని భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు.. చర్మం నిగారింపు మీ సొంతమవుతుంది.

బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు

* అరుగుదల సమస్యలు ఉన్నవారు...బొప్పాయిని తింటే సరి. ఇందులోని పపెయిన్‌ అనే ఎంజైమ్‌ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి ముక్కలను వేస్తారు. ఇందులో పీచు శాతమూ ఎక్కువే ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకెళ్లి...చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.

* రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఎడిమా వంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఎ, సి విటమిన్లు, కాపర్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల పోషకాహారలోపమూ తగ్గుతుంది.

* గుండె వ్యాధులు ఉన్నవారు తరచూ బొప్పాయి తీసుకోవడం మంచిది. మధుమేహమూ అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

* బొప్పాయి ముక్కలను పాలతో కలిపి ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే...బాలింతల్లో పాలు పడతాయి. ఇందులోని పోషకాలు నెలసరి క్రమంగా వచ్చేలా చేస్తాయి. పచ్చిబొప్పాయిని రుతురోజుల్లో మినహా మిగిలిన సమయంలో తింటే...గర్భాశయం ఆరోగ్యంగానూ ఉంటుంది.

ఇదీ చదవండి:Hashish Oil: హైదరాబాద్​లో 'హాషీష్‌ ఆయిల్‌'... పోలీసులకు సవాల్!

ABOUT THE AUTHOR

...view details