తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కొబ్బరి తింటే బోలెడన్ని లాభాలు - health benefits of coconut

మనకు విరివిగా దొరికే వాటిల్లో కొబ్బరి కూడా ఒకటి. దీన్ని నేరుగా తిన్నా, వంటల్లో ఉపయోగించినా... బోలెడు పోషకాలు మీ సొంతమవుతాయి.

coconut
coconut

By

Published : Sep 2, 2020, 11:11 AM IST

  • కొబ్బరిలో ఉండే కాపర్‌, విటమిన్‌ సిలు చర్మానికి సాగేతత్వాన్ని అందిస్తాయి. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకునేవారి చర్మం తాజాగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ముడతలు, చర్మంపై మచ్చలు వంటివి తగ్గుతాయి. ఇక దీనిలోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌ శరీరానికి సమపాళ్లలో అందడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
  • శరీరంలో ఇనుము లోపించినప్పుడు ఎర్రరక్తకణాలకు తగిన ఆక్సిజన్‌ అందదు. రక్తంలో హిమోగ్లోబిన్‌ను వృద్ధి అవ్వదు. అందుకే రోజూ కప్పు కొబ్బరిపాలను ఆహారంగా తీసుకొంటే శరీరానికి కావలసిన దానిలో సగం ఐరన్‌ అందుతుందంటున్నారు నిపుణులు.
  • కొబ్బరి నుంచి లభించే జింక్‌ జుట్టు రాలనీయకుండా చేస్తుంది. సాధారణంగా శరీరంలో మాంగనీస్‌ నిల్వలు తగ్గినప్పుడు గ్లూకోజ్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. కొబ్బరిని తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details