సరైన సమయంలో, సరైన మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ, మోతాదుకు మించి తీసుకుంటేనే ఆరోగ్యానికి దీర్ఘకాలిక హాని కలుగుతుంది. శ్రుతిమించి తాగితే మన శరీరం మరుసటి రోజే మనకు చెప్పేస్తుంది. దీనినే ఆంగ్లంలో హ్యాంగోవర్ అంటారు. హ్యాంగోవర్ వల్ల మానసిక, భౌతిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ నుంచి బయటపడొచ్చో ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నిర్మలా దేవి. అవేంటో చూసేయండి..
మదత్యయా లేదా ఆల్కహాలిజాన్ని లక్షణాల ఆధారంగా నాలుగు విధాలుగా వర్గీకరించారు. పానాత్యయం (అధిక మద్యపానం వల్ల తీవ్రమైన మత్తు), పరమద (హ్యాంగోవర్), పానాజీర్ణ(పొట్టలో పుండ్లు), పానవిభ్రమ( దీర్ఘకాలిక మద్యపానం).... ఇందులో పరమదను అధిగమించాలంటే దాని లక్షణాలు ముందుగా తెలుసుకోవాలి...
హ్యాంగోవర్ లక్షణాలు..
పరమద లేదా హ్యాంగోవర్ అంటే.. రాత్రి తాగిన మద్యం ప్రభావం మరుసటి రోజు ఉదయం కనిపించడం. ఉదాహరణకు..
- కళ్లు ఎర్రగా మారడం
- అధిక దాహం
- తలనొప్పి
- కాంతి, ధ్వనిని భరించలేకపోవడం
- దుర్వాసన (హాలిటోసిస్)
- అధిక లాలాజలం
- ఏకాగ్రత లేకపోవడం
- అలసట, ఆందోళన
- చిరాకు
- వేగవంతమైన హృదయ స్పందన
- మైకం
- వికారం, వాంతులు లేదా విరేచనాలు
- వణుకు వంటి లక్షణాలు కనిపిస్తే.. అది మత్తుతో వచ్చిన చిక్కే అనుకోవచ్చు.