Thyroid asanas:థైరాయిడ్, పారాథైరాయిడ్, పిట్యుటరీ గ్రంథుల పనితీరు మెరుగుపరచుకోవాలని అనుకునేవారికి హలాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని వేసినప్పుడు శరీరం నాగలి మాదిరిగా కనిపిస్తుంది కాబట్టి హలాసనం అని పేరు. ఇది కాస్త కష్టమైన ఆసనం. వెన్నెముక మృదువుగా ఉండేలా చూసుకున్నాకే దీన్ని సాధన చేయటం మంచిది.
Halasana yoga steps
- వెల్లకిలా పడుకొని, చేతులను తిన్నగా చాపి, అరచేతులను నేలకు తాకించి ఉంచాలి.
- కాళ్లను పైకి లేపి, మడమలను పిరుదులకు తాకించాలి. మోకాళ్లను పొట్ట వద్దకు తేవాలి.
- శ్వాసను వదులుతూ ఒక్క ఉదుటున కాళ్లను పైకి లేపాలి. నెమ్మదిగా పాదాలను తల వెనక వైపునకు తేవాలి. కాలి వేళ్లను నేలకు తాకించాలి. అరచేతులతో నేలను బలంగా నొక్కుతూ స్థిరంగా ఉండాలి. చూపును నాభి మీద కేంద్రీకరించాలి. మెడను వంచ కూడదు.
- శ్వాస మామూలుగా తీసుకోవాలి. రెండు నిమిషాలు అలాగే ఉండి, మునుపటి స్థితికి రావాలి.
Halasana pose benefits
- అన్ని గ్రంథులకు చైతన్యం కలిగిస్తుంది. మధుమేహులకు మేలు చేస్తుంది. వెన్నెముక, పిరుదులు, నడుమును బలోపేతం చేస్తుంది. జీర్ణకోశం పుంజుకుంటుంది. జననాంగాలకు మర్దన లభిస్తుంది.