Hair Growth Tips :మనిషికి అందాన్ని ఇచ్చేవి శిరోజాలు. అందుకే ప్రతి ఒక్కరూ జుట్టును అందంగా ఉండేలా చూసుకుంటారు. ఒక వేళ జుత్తు రాలుతూ ఉంటే.. బాగా ఆందోళనకు గురవుతారు. జుట్టు రాలే సమస్యను నివారించేందుకు.. వివిధ రకాల అశాస్త్రీయమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే వీటి వల్ల జుట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే కొన్ని తప్పులు చేయడం ఆపేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Hair Loss Causes : అందం అంటే చర్మ సౌందర్యం మాత్రమే కాదు.. శిరోజాల సంరక్షణ కూడా. అయితే ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యంతో పాటు మనం చేసే కొన్ని పొరపాట్లు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా కేశాలు ఎక్కువగా రాలిపోవడం, చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు రావడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొంత మందికి జుట్టు బలంగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఏమేమి చేయాలి? ఏమేమి చేయకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షాంపూలు అతిగా వాడవద్దు!
Shampoo For Hair Growth : హెయిర్ బ్రష్ లేదా దువ్వెన సరిగ్గా వాడటం జుట్టుకు మంచిది. అలాగని ప్రతి గంటకు ఓసారి జుట్టును దువ్వుకోవద్దు. ఇది జుట్టును మరింత దెబ్బతీస్తుంది. తరచూ షాంపూ చేయడం వల్ల కూడా జుట్టుకు నష్టం వాటిల్లుతుంది. షాంపూలో మీ స్కల్ప్లోని సహజ నూనెలను తొలగించే అనేక రసాయనాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా షాంపూ చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది. 'జుట్టు విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. చర్మ సౌందర్యానికి తీసుకున్నట్లే జుట్టుకూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రై హెయిర్ ఉన్నవారు కండీషనర్స్ ఎక్కువగా వాడాలి. వీళ్లు వారానికోసారి హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిలీ హెయిర్ ఉన్నవారు తరచూ తలస్నానం చేయాలి. డ్రై హెయిర్ ఉన్నవారు వేడినీటితో కాకుండా మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి. జుట్టు బలంగా, దృఢంగా మారాలంటే దానికి ఐరన్, కాపర్, జింక్, బీ-కాంప్లెక్స్, విటమిన్-డి లాంటి పోషకాలను అందించాలి' అని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ చంద్రవతి సూచిస్తున్నారు.