Hair Growth Tips: సాధారణంగా మహిళ్లలో ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు రాలతుంటుంది. దీంతో పాటు హిమోగ్లోబిన్ కొరత, ఐరన్ కొరత, వంశపారపర్యంగా రావడం, స్ట్రెయిట్నింగ్ చేయడం వంటి కారణాలు ఈ సమస్యకు కారణమవుతాయి. వీటిని పరిశీలించుకుని అదుపులో ఉండేలా చూసుకోవాలి. అయినా జట్టు రాలుతుంటే థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేసుకోవాలి.
ఇవన్నీ లేకపోయినా జట్టు రాలుతుంటే పోషకాహారం తీసుకోవాలి. స్ప్రౌట్స్, డ్రైఫ్రూట్స్, పాలు, డేట్స్, పప్పు ధాన్యాలు, గుడ్లు, బాదం వంటి పోషక విలువల గల ఆహారాన్ని తీసుకోవాలి. కొందరు కెరాటిన్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ ట్రీట్మెంట్, హానికర షాంపూలు ఉపయోగిస్తుంటారు. దీని వల్ల జుట్టు బలహీనపడి అధికంగా రాలుతుంది. ఇలాంటివి చేస్తుంటే వెంటనే నిలిపివేయాలి.