గ్రీన్ టీ.... ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆరోగ్యం కోసం ఈ టీనే తాగుతున్నారు. ఈ తేనీరు తాగేవాళ్లలో ఉబకాయంతో ఇబ్బంది పడేవారే అధికం. అయితే గ్రీన్ టీ తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ చక్కటి ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు అమెరికాకు చెందిన శాస్త్రవేతలు. నిత్యం గ్రీన్ టీ తీసుకునే వారిలో శరీర బరువు తగ్గినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఫిటోథెరపీ రీసెర్చ్ మ్యాగజైన్లో ప్రచురించారు.
రోజూ 'గ్రీన్ టీ' తాగితే బరువు తగ్గుతారా? - గ్రీన్‌టీ బరువును తగ్గిస్తుందా
గ్రీన్ టీ ప్రతిరోజు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేశారు అమెరికాకు చెందిన పరిశోధకులు. ఈ తేనీరును సేవించటం ద్వారా బరువు తగ్గడాన్ని గుర్తించినట్లు తెలిపారు.
అధిక బరువుకు 'గ్రీన్ టీ'తో చెక్
ఈ అధ్యయనం కోసం మొత్తం 1,344 మందిపై పరిశోధన జరిపారు. వీరిపై మొత్తం 26 సార్లు ట్రయల్స్ నిర్వహించినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు పరిశోధకులు. 12 వారాల కంటే ఎక్కువ రోజులు గ్రీన్ టీని.. రోజు 800 మి. గ్రా కంటే తక్కువ మోతాదులో సేవించిన వారిలో... శరీర బరువులో మార్పులు గమనించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే గ్రీన్ టీని తాగటం వల్ల నడుము చుట్టు కొలతలో ఎటువంటి మార్పు జరగలేదని చెప్పుకొచ్చారు.
Last Updated : May 21, 2020, 4:50 PM IST