Ginger Benefits : అల్లం వంటకాలకు మంచి రుచిని అందిస్తుంది. అందుకే దాదాపు చాలా వంటకాల్లో అల్లంను వాడతారు. మన రోజూ తీసుకునే ఆహారాల్లో ఒక్కదానిలోనైనా అల్లం భాగమై ఉంటుంది. అల్లం వల్ల వంటలకు మంచి రుచి రావడమే కాకుండా దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Ginger Health Benefits : అల్లంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంట, వాపు, వికారాన్ని తగ్గిస్తాయి. అలాగే బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపర్చుకోవడంలో అల్లం మనకు ఎంతో సహాయపడుతుంది. ఇవే కాదు.. అల్లం తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కీళ్ల నొప్పులకు చక్కని పరిష్కారం..
Ginger For Knee Pain : కీళ్ల నొప్పులను అల్లం తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కీళ్ల ఆరోగ్యానికి అవసరమయ్యే మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, బీ6 విటమిన్లుఅల్లంలో పుష్కలంగా ఉన్నాయి. దీంతో వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పి నుంచి బయటపడవచ్చు.
ఆకలిని పెంచే గుణాలు..
Ginger For Hunger : అలాగే అల్లం ఆకలిని పెంచుతుంది. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాన్సర్ బాధితులకు ఆకలి మందగిస్తుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆకలిగా అనిపించదు. అలాంటివారికి నీళ్లల్లో నిమ్మరసం, అల్లం కలిపి ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలా తీసుకోవడం వల్ల వారికి ఆకలి పెరుగుతుంది.
దగ్గు, జలుబు, తలనొప్పికి విరుగుడు..
Ginger For Cough And Cold : దగ్గు, జలుబు, తలనొప్పి, మైగ్రేన్, నడుంనొప్పి, వెన్నుపూస నొప్పి, మోకాలి నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ఇందులో నొప్పి, వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి. రోజుకు 2 నుంచి 5 గ్రాముల అల్లంను రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితముంటుంది. దగ్గు, జలుబు ఉన్నప్పుడు అల్లం తింటే వెంటనే తగ్గుతుంది.
కడుపునొప్పి, అజీర్తితో బాధపడేవారికి ఉపశమనం..
Ginger For Stomach Pain : కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, వికారం, అజీర్తితో బాధపడేవారు అల్లం తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. పాలు లేకుండా అల్లం టీ లేదా బ్లాక్ టీ తాగడం వల్లన కొద్ది నిమిషాల్లోనే కడుపునొప్పి తగ్గుతుంది. మహిళలకు నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. అలాంటి సమయాల్లో ట్యాబ్లెట్ల కన్నా అల్లం తీసుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..
Ginger For Cholesterol: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీంతో అల్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. పచ్చి అల్లం లేదా అల్లం నీరు, అల్లం టీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
క్యాన్సర్‌కు విరుగుడు..
Ginger For Cancer : అలాగే క్యాన్సర్‌కు విరుగుడుగా కూడా అల్లం పనిచేస్తుందట. కొలొరెక్టర్, లివర్ క్యాన్సర్లపై పోరాడే గుణాలు అల్లంలో సమృద్ధిగా లభిస్తాయి. దీంతో రోజూ అల్లం తీసుకోవడం వల్ల వివిధ క్యాన్సర్ల ముప్పు నుంచి బయటపడవచ్చు.