మెదడు చురుగ్గా, ప్రశాంతంగా ఉండాలంటే ఒత్తిడిగా ఉన్నప్పుడు ఓ పావుగంటైనా సరే! ఒంటరిగా కూర్చోవాలి. చక్కని ఆలోచనలు వస్తాయట. ఆ సందర్భంలోనే కాదు...రోజూ ఓ అరగంట సమయాన్ని ధ్యానం కోసం కేటాయించి చూడండి. మీతో మీరు మాట్లాడుకోండి.మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. పనిలో చురుగ్గానూ ఉంటారు.
ఆలస్యంగా నిద్రలేవడం, హడావుడిగా వంటింట్లోకి పరుగులు తీయడం మనలో చాలామందికి అలవాటే. దీనివల్ల మెదడూ, శరీరం యాంత్రికంగా పనిచేయడానికి అలవాటు పడిపోతాయి. అందుకే మీరు మీ పని మొదలుపెట్టడానికి కనీసం గంట ముందైనా నిద్రలేవండి. చిన్నచిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు, నడక, జాగింగ్, యోగా వంటివేవైనాసరే కాసేపైనా చేయాలి. ఇవి మెదడునీ, శరీరాన్ని సమన్వయం చేస్తాయి. అలాగే గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే ఒత్తిడి దరిచేరదు. శరీరం ఉత్సాహంగా ఉంటుంది.