తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

హాయిగా నిద్రపోతే మతిమరుపు మటుమాయం! - etv bharat health

నిద్రలేచిన దగ్గర నుంచి ఎన్నో పనుల్ని ఓ ప్రణాళిక ప్రకారం చేస్తాం. కానీ నిద్రకు మాత్రం సరైన ప్రణాళిక ఉండదు. ఈసారి ప్రణాళిక వేసుకుని చూడండి. ఎన్నో లాభాలు మీ సొంతం అవుతాయంటున్నారు నిపుణులు.

get-rid-of-memory-loss-with-proper-sleep
హాయిగా నిద్రపోతే మతిమరుపు మటుమాయం!

By

Published : Sep 26, 2020, 10:31 AM IST

Updated : Sep 26, 2020, 10:59 AM IST

తరచూ కొన్ని విషయాలు మర్చిపోతుంటే.. మీరు నిద్ర సరిగా పోవట్లేదని అర్థం. పడుకున్న తరువాత మన అవయవాలన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. మెదడు మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. మన జ్ఞాపకాలను అన్నింటిని పదిలంగా భద్రపరిచే పనిలో ఉంటుంది. మనం నిద్ర సరిగా పోకపోతే ఆ పని ఆగిపోతుంది. నిద్ర సరిగా పోనివారిలో ఈ మతిమరపు లక్షణాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. కాబట్టి వేళకు సరిపడా గంటలు నిద్రపోవడం మంచిదంటున్నారు వైద్యులు.

అంతేనా నిద్రతో ఇంకెన్నో లాబాలున్నాయి. అవేంటో చూసేయండి...

  • బాగా నిద్రపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి.
  • నిద్ర నేరుగా మీ బరువును తగ్గించదు. అయితే మీ ఆకలిని, ఎక్కువ కేలరీలు ఉండే పదార్థాలను తినాలనే కోరికను కలిగించే హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలంటే వేళకు నిద్రపోవడం మంచిది.
  • నిద్ర నొప్పి నివారిణిలా కూడా పనిచేస్తుందట. గాయాలైనప్పుడు ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • నిర్ణీత వేళ్లలో క్రమం తప్పకుండా హాయిగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఒత్తిడిని నియంత్రించే హార్మోన్లు ఆ సమయంలోనే ఉత్పత్తి అవుతాయి.
  • చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉండాలన్నా వేళకు నిద్ర ముఖ్యమే తెలుసా.

ఇదీ చదవండి:'గోధుమ పిండి'తో అందంగా మారిపోదామిలా

Last Updated : Sep 26, 2020, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details