తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బ్లాక్‌హెడ్స్ కు గుడ్ బాయ్ చెప్పేద్దామిలా!

కొంతమంది చాలా ఫెయిర్‌గా, అందంగా ఉంటారు. కానీ ముక్కు, గడ్డం దగ్గర బ్లాక్‌హెడ్స్ సమస్యతో సతమతమవుతుంటారు. వాటి కారణంగా బయటకు కూడా వెళ్లడం మానేస్తారు. బ్లాక్‌హెడ్స్ వల్ల తమ సహజ సౌందర్యాన్ని కోల్పోతే ఆ మాత్రం చింత ఉండదా? అయితే ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించే ఈ సమస్యకు స్వస్తి పలకచ్చు. అదెలాగో చూద్దాం రండి..

Get Rid of Blackheads Naturally in Telugu
బ్లాక్‌హెడ్స్ కు గుడ్ బాయ్ చెప్పేద్దామిలా!

By

Published : Aug 22, 2020, 10:30 AM IST

చాలామంది బ్లాక్‌హెడ్స్ తొలగించుకోవడానికి పార్లర్స్‌ను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే కాస్త సమయం వెచ్చించి, ఓపిక వహిస్తే ఇంట్లోనే వాటిని సులభంగా తొలగించుకోవచ్చు.

  • బాగా మరిగించిన నీళ్లు తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత ఒక మెత్తని క్లాత్ మీద ఆ నీళ్లు వేసి బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట ఆ వస్త్రంతో అద్దుతూ ఉండాలి. ఆవిరి చర్మానికి అందేలా జాగ్రత్తపడాలి. ఫలితంగా బ్లాక్‌హెడ్స్ మెత్తబడి చర్మం దగ్గరకు నొక్కగానే సులభంగా బయటకు వచ్చేస్తాయి.
  • అయితే ఈ చిట్కా కొందరికే ఉపకరిస్తుంది. చర్మం లోపలి పొర నుంచి బ్లాక్‌హెడ్స్ ఉంటే అవి అంత తొందరగా తొలగిపోవు. వాటికోసం కొన్ని రకాల సహజసిద్ధమైన ప్యాక్స్ ఉపయోగించాల్సిందే.
బొప్పాయితో

బొప్పాయితో..

బాగా పండిన బొప్పాయి తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో పావుస్పూను శెనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట అప్త్లె చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చొప్పున క్రమం తప్పకుండా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్‌కు సులభంగా స్వస్తి పలకచ్చు.

తేనెతో..

తేనెతో..

తేనె, నిమ్మరసం, పంచదార చెంచా చొప్పున తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట రాసుకొని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా రోజూ అనుసరించవచ్చు. ఈ విధంగా క్రమంగా చేయడం ద్వారా సమస్య నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు.

పుదీనారసంతో..

పాలతో..

పచ్చిపాలు కొద్దిగా తీసుకొని వాటితో బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా రోజూ క్రమం తప్పకుండా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

ఆవిరి పట్టడం..

ఆవిరి పట్టడం..

ఒక పాత్రలో బాగా మరిగించిన నీళ్లు తీసుకొని ఆ ఆవిరిని ముఖానికి పట్టాలి. ఇందుకోసం ఒక టవల్ ఉపయోగించి తల మీదుగా కవర్ చేయాలి. ఇలా ఒకటి నుంచి రెండు నిమిషాలు ముఖానికి ఆవిరి పట్టి తీసేయాలి. ఈవిధంగా మూడు లేదా నాలుగుసార్లు చేయాలి. తర్వాత బ్రౌన్ షుగర్‌తో మృదువుగా మర్దన చేసుకోవడం ద్వారా బ్లాక్‌హెడ్స్ తొలగిపోవడంతోపాటు మోము ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

అయితే ముఖానికి మరీ ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలాగే నీళ్లు మరీ ఎక్కువ వేడిగా చర్మానికి హాని కలగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి.

పుదీనారసంతో..

చెంచా పుదీనారసం, అరచెంచా పసుపు తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట అప్త్లె చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారినికోసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు. ఈ చిట్కా పాటించిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ తప్పకుండా అప్త్లె చేసుకోవాలి.

ఇవేకాదు.. కలబంద, కొబ్బరినూనె, మెంతులు, టొమాటోలు, నిమ్మరసం, ఓట్స్, ముల్తానీమట్టి, కోడిగుడ్డులోని తెల్లసొన, పెరుగు, కొత్తిమీర, బేకింగ్‌సోడా.. మొదలైనవి ఉపయోగించి కూడా బ్లాక్‌హెడ్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

ఇదీ చదవండి: నోటిలో పుండ్ల సమస్యకు కొన్ని వంటింటి చిట్కాలు!

ABOUT THE AUTHOR

...view details