Thalassemia disease facts : దేశ వ్యాప్తంగా తలసేమియా బాధితుల సంఖ్య ఏటికేడు లెక్కకు మిక్కిలిగా పెరుగుతోంది. బిడ్డల ప్రాణాలు కాపాడుకునేందుకు వేలకు వేలు పోస్తూ.. పోరాటం చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్‌లోని తలసేమియా సొసైటీ.. జీనోమ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఓ అధ్యయనం చేపట్టాయి. తెలంగాణలోని 4 జిల్లాల్లో తలసేమియా వ్యాప్తి ఎక్కువగా ఉందని నిర్ధరించాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ సమస్య తీవ్రంగానే ఉందని అంటున్నారు.. జీనోమ్ ఫౌండేషన్ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ వీఆర్ రావు. తలసేమియాపై ఎలా అధ్యయనం సాగించారు..? ఏయే ప్రాంతాల్లో తీవ్రత గుర్తించారు..? అన్న అంశాలను ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు.. డాక్టర్ వీఆర్ రావు.
Thalassemia disease : 'బీటా తలసేమియా ఉనికి ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారత్‌లో పలు వర్గాల్లో ప్రమాదకర స్థాయిలో ఉంది. ఐసీఎమ్‌ఆర్ టాస్క్‌ఫోర్స్ నమూనాలు సేకరించింది. దేశవ్యాప్తంగా 6 లక్షల మందిని పరిశీలించింది. 2-5% మేర తలసేమియా ఉన్నట్టు తేలింది. టాస్క్‌ఫోర్స్ టెస్టింగ్ పరిధిలో తెలంగాణ లేదు. జన్యువుల్లో మ్యుటేషన్ల వల్లే తలసేమియా వస్తుంది. తలసేమియాలో మైనర్లే క్యారియర్లుగా మారతారు. తెలంగాణలో 31 జిల్లాల్లోని 312 మందిని పరిశీలించాం. తెలంగాణలో 4 జిల్లాల్లో తలసేమియా తీవ్రత బాగా ఉంది. మహబూబ్‌నగర్‌లో 33 మేజర్ కేసులు గుర్తించాం. రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మంలోనూ తలసేమియా ఉంది. మొత్తం 48 సామాజిక వర్గాల్లో వ్యాప్తి చెందుతోంది.'
-డాక్టర్ వీఆర్ రావు