తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ప్రెగ్నెన్సీని ఏ తేదీ నుంచి లెక్కించాలి? డాక్టర్లు ఏమంటున్నారు?

పెళ్లైన దగ్గరి నుంచి కొత్త జంట శుభవార్త ఎప్పుడు చెబుతుందా అని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వార్త కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీ తేదీ లెక్కింపు అనేది ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేని అంశం. అసలు ప్రెగ్నెన్సీ తేదీని వైద్యులు ఎలా లెక్కించాలని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

From Which Date We Keep Count On Pregnancy Months
ప్రెగ్నెన్సీని ఏ తేదీ నుంచి లెక్కించాలి? డాక్టర్లు ఏమంటున్నారంటే..?

By

Published : Apr 10, 2023, 5:02 PM IST

మాతృత్వం అనేది మహిళ వైవాహిక జీవితంలో అత్యంత కీలకమైన విషయాల్లో ఒకటి. గర్భం దాల్చడం మహిళలకు ఒక భావోద్వేగ ప్రయాణం. వారి జీవితాల్లో ఇది మర్చిపోలేని అనుభూతి అని పెద్దలు అంటుంటారు. గర్భధారణతో మహిళ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వారి కడుపులో ఒక జీవం కాదు భవిష్యత్ ప్రాణం పోసుకుంటుందని చెప్పొచ్చు.

ఒక ప్రాణికి కొత్త జీవితాన్ని ఇవ్వడం అనేది కేవలం మహిళామూర్తులకే సాధ్యం. మహిళలు గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం అనేది తల్లులుగా వారికి ఎంతో సంతోషకరమైన విషయం. ఆయా కుటుంబాలకు కూడా అంతే ఆనందకరమైన క్షణాలుగా చెప్పొచ్చు. బుడి బుడి అడుగులు వేస్తూ బుజ్జి పాపాయి చేసే సందడికి ఇంట్లోని పెద్దలు కూడా నవ్వుతూ, కేరింతలు కొడుతూ, ఆడుతూ వారూ పిల్లలుగా మారిపోతుంటారు.

గర్భధారణ అనేది మహిళల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంలోనూ కీలక మార్పులు తీసుకొస్తుందని డాక్టర్లు అంటున్నారు. అలాంటి ప్రెగ్నెన్సీకి సంబంధించి మహిళల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భధారణ తేదీ లెక్కింపు విషయంలో చాలా మందికి అవగాహన లేదు. ఇంట్లో పెద్దవాళ్లు ఒకలా చెబితే, వైద్యులు మరోలా ప్రెగ్నీన్సీ పీరియడ్​ను లెక్కించే సందర్భాలను చూసి ఉంటాం. ఈ నేపథ్యంలో ప్రెగ్నెన్సీ తేదీని ఏ విధంగా లెక్కించాలో ఇప్పుడు చూద్దాం.

"ప్రెగ్నెన్సీ టెస్టులో పాజిటివ్​గా వచ్చిన తర్వాత గర్భిణికి చివరగా ఎప్పుడు పీరియడ్స్​ వచ్చాయో తెలుసుకుంటాం. ఆఖరిగా ఎప్పుడు బహిష్టు (రుతుక్రమం) అయ్యిందో అందులోని మొదటి రోజు ఆధారంగా ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ అనేది మేం చెబుతాం. గర్భధారణ పరీక్ష సానుకూలతను బట్టి కేవలం వారు గర్భం దాల్చారనేది మాత్రమే మేం ధ్రువీకరించగలం. కానీ ప్రెగ్నెన్సీ ఉందా లేదా? గర్భం సరైన స్థానంలో ఉందా? ప్రెగ్నేన్సీ తేదీలు మీరు చెప్పే తేదీలు సరిగ్గా సరిపోతున్నాయా అనేది టీవీఎస్ స్కాన్ చేసిన తర్వాతనే చెప్పగలం." అని వివరించారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య.

ఈడీడీ ప్రకారం లెక్కింపు:
గర్భధారణ వారాలను మొదట మహిళలు చెప్పే తేదీలను బట్టే లెక్కిస్తామని గైనకాలజిస్ట్​ సాహిత్య చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ నెలల లెక్కింపు అనేది మరిన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుందని.. ఇందులో ముఖ్యమైనది చివరి ఆరు నెలలు అని తెలిపారు. ఈ సమయంలో ఎలాంటి హార్మోన్ల చికిత్స తీసుకొని ఉండకూడదని అన్నారు. రుతుస్రావం ముందే అవ్వడానికి లేదా రుతుస్రావాన్ని వాయిదా వేయడం కోసం గానీ ఎలాంటి హార్మోన్ల చికిత్స తీసుకోకూడదని సూచించారు.

అలాగే పీరియడ్స్​కు మధ్య అంతరం కూడా 28 నుంచి 30 రోజుల వరకే ఉండాలని డాక్టర్ వివరించారు. ఇలా నాలుగైదు విషయాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా గర్భధారణ వారాలను లెక్కిస్తామన్నారు. అల్ట్రా సౌండ్ స్కాన్, ఈఈడీ పరీక్షలు కూడా చేస్తామని చెప్పారు. మహిళలు చెప్పిన తేదీకి, ఆ తేదీకి ఏడు రోజుల కంటే ఎక్కువ తేడా ఉంటే "స్కాన్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ" (ఈడీడీ)ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని గైనకాలజిస్ట్ సాహిత్య వివరించారు.

ప్రెగ్నెన్సీని ఏ తేదీ నుంచి లెక్కించాలి? డాక్టర్లు ఏమంటున్నారు?

ABOUT THE AUTHOR

...view details