తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అతిగా రతిలో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా? - దంపతులు రతిలో పాల్గొంటే

sexual intercourse: కొంతమందికి శృంగారంలో పాల్గొనడంలో ఆసక్తి ఉండదు. మరికొంతమందికి మాత్రం ఎన్నిసార్లు సెక్స్​లో పాల్గొన్నా సంతృప్తి కలగదు. అసలు ఇలా అతిగా రతిలో పాల్గొనే వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? అతిగా సెక్స్​లో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా..?

Frequency Of Sex
అతిగా రతిలో పాల్గొంటే

By

Published : Jan 9, 2022, 9:02 AM IST

sexual intercourse: శృంగారం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే.. చాలామందికి ఓ అపోహ ఉంది. రతిలో ఎక్కువగా పాల్గొంటే వారికి ఆయుష్షు క్షీణిస్తుందని అనుకుంటూ ఉంటారు. అతిగా వీర్యనష్టం జరగడం వల్లకూడా ఆయుష్షు క్షీణిస్తుందని బాధపడుతుంటారు. అయితే ఇదంతా అపోహ మాత్రమే.. మగవారికి ఎంత వీర్యం పోయినా.. వచ్చే నష్టమేమీలేదు.

ఇక ఆడవాళ్లు కూడా.. సెక్స్​లో పాల్గొంటే ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆయుష్షు క్షీణిస్తుందన్న అపోహ ఉంది. కానీ అది పచ్చి అబద్ధం. ఎవరైతే సెక్స్​లో చక్కగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటారో వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆయుష్షు కూడా పెరుగుతుంది.

ఎందుకంటే శృంగారంలో పాల్గొంటే ఫీల్​గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. డోపమిన్​, సెరొటెనిన్​, ఎండార్ఫిన్​, ఆక్సిటోసిన్​, లాంటి హార్మోన్లు విడుదలవుతాయి. అంతేకాక రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • కొందరు మహిళలకు రతిలో పాల్గొన్నప్పుడు రక్తం వస్తుంది. ఎందుకు?
  • అధిక సమయం రతిలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా?
  • రతి అనంతరం కొందరు మహిళలకు కాళ్లు పట్టేస్తాయి ఎందుకు?
  • సెక్స్ పూర్తయిన వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలనిపిస్తుంది.. కారణమేంటి?

ఇదీ చూడండి:రతిలో ఎక్కువ తృప్తి పొందేది ఎవరు?

ABOUT THE AUTHOR

...view details