Foods To Avoid In Empty Stomach : పరగడుపున ఏం తినాలి? ఏం తినకూడదు అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉంటాం కాబట్టి పొద్దున్నే తీసుకునే ఆహారం చాలా కీలకం. పొద్దున్నే పరగడుపున తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ కొందరు హెవీగా, కొందరు లైట్‌గా తీసుకుంటారు. కాగా.. పరగడుపున తినకూడని నాలుగు ఆహార పదార్థాలు గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
నిమ్మకాయ నీళ్లలో తేనె కలుపుకొని తాగితే...?
What To Eat In Empty Stomach : చాలామంది పరగడుపున నిమ్మకాయ నీళ్లలో తేనె కలుపుకొని తాగుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గి.. బరువు తగ్గుతామని భావిస్తారు. అయితే ఈ అభిప్రాయం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. తేనెలో ఎక్కువ కేలరీలు ఉంటాయని అంటున్నారు. అలాగే మార్కెట్లో దొరికే కల్తీ తేనే తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని సూచిస్తున్నారు.
అయితే ఈ అంశంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛమైన తేనె వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయని మరికొందరు అంటున్నారు. తేనె.. రోగ నిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. తేనె తాగడం వల్లల జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు.
టీ అండ్ కాఫీ తాగితే?
Empty Stomach Coffee Or Tea :పరగడుపున టీ, కాఫీ తాగడం వల్ల పొట్టలో యాసిడ్స్ పెరుగుతాయి. ఫలితంగా ఆహారం జీర్ణం కావడంపై ప్రభావం పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఒత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో టీ, కాఫీ తాగితే అందులో ఉండే కెఫిన్.. కార్టిసోల్‌ను మరింతగా పెంచుతుందని నిపుణులు వివరిస్తున్నారు. తద్వారా ఒత్తిడి మరింత పెరుగుతుందని చెబుతున్నారు. నిద్ర లేచిన తర్వాత గంట, రెండు గంటల వరకు టీ, కాఫీ తాగొద్దని సూచిస్తున్నారు.
పరగడుపున పండ్లు తినొచ్చా..?
Empty Stomach Fruits : ఇతర ఆహారాలతో పోలిస్తే పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. మళ్లీ కొద్ది సేపటికే ఆకలి కలుగుతుంది. సిట్రస్ కలిగిన పండ్లు పరగడుపున తింటే ఎసిడిటీకి కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మంచి బ్రేక్ ఫాస్ట్ అంటే ఏంటి...?
Empty Stomach Breakfast :పరగడుపున ప్రోటీన్, ఫ్యాట్‌తో కూడిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వేగంగా ఆకలి వేయదని చెబుతున్నారు. ప్రోటీన్ ఫుడ్‌తో పాటు.. నట్స్, అవకాడో, నెయ్యి వంటి వాటిని బ్రేక్ ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.షుగర్సమస్య లేని వాళ్లు ఉదయం పండ్లు, తేనెను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోవచ్చని అంటున్నారు.