కొత్తగా వ్యాయామం చేస్తున్నారా?. అయితే ఎక్సర్‌సైజ్ చేసే ముందు, ఆ తర్వాత ఏం తినాలో అవగాహన లేక ఇబ్బందులు పడుతుండే ఉంటారు. వర్కవుట్ చేసిన తర్వాత శక్తిలేనట్లు అనిపిస్తుంది. అయితే వ్యాయామానికి ముందు, తర్వాత ఏం తీసుకోవాలో తెలుసుకుంటే తగిన ఫలితాలు దక్కుతాయంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలూ అందిస్తున్నారు.
ముందుగా..
వర్కవుట్ చేసే ముందు ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఇది చాలా ముఖ్యమైంది. ఏమీ తినకుండా చేయడం మంచిది కాదు. అవసరమైన శక్తిని తయారు చేసుకోవడానికి శరీరానికి అరగంట ముందు తగిన ఆహారాన్ని అందించాల్సిందే. అరటి పండు లేదా యాపిల్‌ను తీసుకోవచ్చు. లేదంటే ద్రాక్ష, స్ట్రాబెర్రీ ముక్కలను నాలుగైదు కలిపిన కప్పు ఓట్స్‌ను తింటే మంచిది. అలాగే కప్పు పోహాను తీసుకోవచ్చు. పీనట్‌బటర్ రాసిన బ్రెడ్ ముక్కను తిని వర్కవుట్‌కు వెళ్లొచ్చు. తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తిని అందించేలా ఆహారం ఉంటే చాలు. అలాకాకుండా కొవ్వు ఎక్కువగా ఉండేవి, వేపుళ్లు చేసిన ఆహారాన్ని మాత్రం తీసుకుంటే వ్యాయామం కష్టమవుతుంది.