తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రాత్రి మగతకు చిరు సాయం! - రాత్రి షిఫ్టుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే

ప్రస్తుతం ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందించటం పరిపాటిగా మారిపోయింది. రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారు అప్రమత్తంగా, మెలకువగా ఉండటం చాలా అవసరం. అయితే నిద్ర పోకుండా రాత్రివేళ కూడా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలాంటి చిట్కాలు పాటించాలనే దానిపై ఓ పరిశోధన కీలక విషయాలు వెల్లడించింది. ఆ చిట్కాలేమిటో మీరు తెలుసుకోండి మరి!

Food to take at night shift
నైట్ షిఫ్ట్ చేసేవారికి ఆరోగ్య సలహాలు

By

Published : Dec 2, 2020, 11:26 AM IST

వేళాపాళా లేని తిండి. ముంచుకొచ్చే నిద్ర మత్తు. మందగించే ఆలోచనలు. రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు తరచుగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. వీటిని తగ్గించుకోవటానికి ఆహారంలో మార్పులు చేసుకోవటం.. ముఖ్యంగా చిరుతిండి (స్నాక్స్‌) బాగా ఉపయోగపడుతున్నట్టు దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. రాత్రివేళల్లో పనిచేసేవారు కడుపు నిండా తిన్నప్పుడు, కడుపు మాడ్చుకున్నప్పుడు, చిరుతిండి తిన్నప్పుడు కనపడే ప్రభావాలను పరిశోధకులు బేరీజు వేసి మరీ ఈ విషయాన్ని గుర్తించారు.

ప్రస్తుతం ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. రాత్రనకా పగలనకా రోజంతా సేవలందించటం పరిపాటిగా మారిపోయింది. వైద్యం, విమాన, రవాణా, గనులు, సాఫ్ట్‌వేర్‌.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా రాత్రి షిఫ్టు ఉద్యోగాలు తప్పనిసరి అయిపోయాయి. ఇలాంటివాళ్లు రాత్రిపూట మెలకువగా, అప్రమత్తంగా ఉండటం నిజంగా కత్తి మీద సామే. దీనితో చాలామంది ఏదో ఒకటి తింటూనో.. కాఫీ, కూల్‌డ్రింకుల వంటివి తాగుతూనో మెలకువగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా? అన్నదానిపై పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ పరిశోధకులు వినూత్నమైన అధ్యయనం నిర్వహించారు.

చిరుతిండి మేలు..

కాస్త ఎక్కువ భోజనం చేసినవారు, పూర్తిగా కడుపు మాడ్చుకున్నవారితో పోలిస్తే.. చిరుతిండి (ఓ పల్లీ పట్టీ, యాపిల్‌) తిన్నవారు ఒకింత అప్రమత్తంగా ఉంటున్నట్టు, పనిలో నైపుణ్యం మెరుగవుతున్నట్టు బయటపడటం గమనార్హం. వారిలో మగత, అలసట కూడా తక్కువగానే ఉండటం విశేషం. అందువల్ల రాత్రి షిఫ్టులో పనిచేసేటప్పుడు నూనె, కొవ్వులు ఎక్కువగా ఉండే చిప్స్‌, జంక్‌ఫుడ్‌ వంటి వాటికి బదులు ఓ పండో, పల్లీ పట్టి లాంటివో వెంట తీసుకెళ్లండి. వీటితో పనిలో రాణిస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

ఇదీ చూడండి:నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ముప్పే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details