అలసిన శరీరం విశ్రాంతి కోరుతుంది. బాగా నిద్రపోతేనే, ఉదయం లేచి మన పనుల్ని మనం చక్కగా చేసుకోగలం. ఎంతలేదన్నా.. ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే శరీరం సేదతీరుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది. కారణాలేవైనా.. కొన్నిసార్లు సక్రమంగా నిద్రపట్టదు. అటువంటి సమయాల్లో మనకు సర్వసహజంగా అందుబాటులో ఉండే ఔషధ మూలికలు ఉపకరిస్తాయి. వాటి గురించి పరిశోధించిన డాక్టర్ నయనతార శాంతి.. ఐదు ఉత్తమ మూలికల గురించి చెప్పారు.
ఐదు ఉత్తమ ఔషధ మూలికలు..
లావెండర్(సుగంధ ద్రవ్యాలు).. భయాల్ని తగ్గించే సువాసనలు కొన్ని ఉంటాయి. అవి కుంగుబాటును కూడా అదుపు చేస్తాయి. ప్రశాంతమైన నిద్రకు ఎంతో కొంత దోహదపడతాయి. తులసి, మరువం నుంచి వచ్చే పరిమళాలు ఉపశమనమిస్తాయి. పీల్చే లావెండర్లు ఒత్తిళ్లను కొంతవరకైనా తగ్గిస్తాయి.
చామంతి..
చామంతి ప్రసిద్ధి చెందిన పురాతన ఔషధ మూలిక. ఆధునిక అధ్యయనాలు చామంతి సామర్థ్యాన్ని రుజువు చేస్తున్నాయి. చామంతి ఆందోళనను తగ్గిస్తుంది. మీ నరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది. బిడ్డకి జన్మనిచ్చిన స్త్రీలలో కొందరు ఆ ప్రసవం తాలూక నిస్సత్తువ, ఇతర విధాల ఆందోళనలతో సతమతమవుతుంటారు. రాత్రిపూట సరైన నిద్ర లేక భారంగా రోజులు వెళ్లదీస్తుంటారు. అలాంటివారు ఓ రెండు వారాలపాటు చామంతి టీ తాగితే ఉపశమనం పొందుతారని ఒక పరిశీలన వెల్లడించింది.
వలేరియన్..
వలేరియన్ ఔషధ మూలిక వేర్లు నిద్రలేమితో బాధపడుతున్న వారికి చికిత్స సమయంలో వాడుతారు. ఆ వేర్లు మెరుగైన నిద్రను ప్రేరేపిస్తాయి. వలేరియన్ వేర్లు.. మాత్రల రూపంలో ముందుల దుకాణాల్లో లభిస్తాయి.
జుమికి(పాషన్ ఫ్లవర్)..
జుమికి పువ్వులు శరీరవ్యవస్థకు మేలు చేస్తాయి. అప్పటికప్పుడే ఉపశమనమిచ్చి, ఆందోళన తగ్గించి నిద్రలోకి జారుకునేలా చేస్తాయి.