తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కంటిని కాపాడుకునేందుకు 'ట్వంటీ-ట్వంటీ' రూల్ - ways to keeps eyes safe during covid-19

'సర్వేంద్రియానాం నయనం ప్రధానం'.. కళ్లకు అంతటి ప్రాముఖ్యం ఇస్తారు. వాటిని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత కరోనా కాలంలో కళ్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి పట్ల జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Eye Care
సుఖీభవ

By

Published : Apr 28, 2020, 6:34 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కరోనా వైరస్.. సాధారణంగా కళ్లు, ముక్కు, నోరు ద్వారా ఇతరుల నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందువల్లనే మాస్కులు, భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే మన ముఖంలో కళ్లను ఎక్కువగా ముట్టుకుంటాం. తుడవటం, కళ్లలో ఏదైనా పడితే రుద్దడం వంటివి చేస్తుంటామని కంటి నిపుణులు డాక్టర్ సుదీప్ కిశోర్ జైన్​ అంటున్నారు. ఈ పనుల వల్ల చేతులపై ఉండే బాక్టీరియా, వైరస్​లు శరీరంలోకి చేరుతాయని అన్నారు.

"మన శరీరంలో ఎక్కువగా ఉపయోగించే అవయవం కళ్లు. ఈ గ్యాడ్జెట్​ శకంలో వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిపై ఒత్తిడి పెరిగితే కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది."

- డాక్టర్​ సుదీప్ కిశోర్ జైన్

కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.

కళ్లను రుద్దటం, ముట్టుకోవటం మానుకోవాలి. వాటి రక్షణకు సూచించిన కళ్ల అద్దాలను ధరించాలి. కళ్లను తాకే ముందు 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలని సుదీప్ సూచిస్తున్నారు.

  • కళ్లు పొడిబారటం వల్లనే ఎక్కువగా వాటిని తాకుతుంటాం. దీనిని నివారించేందుకు ఫోన్​, టీవీ, కంప్యూటర్ వాడకం తగ్గించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఐడ్రాప్స్​ వాడటం ఉత్తమం.
  • ఈ మధ్య కాలంలో ఇళ్లలోనే ఉంటున్న కారణంగా డిజిటల్ గ్యాడ్జెట్స్ వాడకం పెరిగింది. ఈ సమయంలో ట్వంటీ-ట్వంటీ-ట్వంటీ నిబంధన పాటించాలి. స్మార్ట్​ఫోన్​, టీవీ, కంప్యూటర్​ ఉపయోగించినప్పుడు 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరాన్ని చూస్తూ 20 సార్లు రెప్పలు వాల్చాలి.
  • ఒమెగా- 3, 6 పోషకాలు సమృద్ధిగా లభించే వాల్​నట్స్, బ్రకోలి, విత్తనాలు, పల్లీలు, సోయాబీన్, మొక్కజొన్న తదితరాలను తీసుకోవాలి. వెలుతురు వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇవి తగ్గిస్తాయి.
  • కరోనా సోకినవారిలో కళ్ల కలక అరుదుగా కనిపిస్తుంది. ఎర్రటి కళ్లు, జర్వం, దగ్గుతో డిశ్చార్జి అయిన రోగులు తరచూ వైద్యులను సంప్రదించాలి. వాళ్లు సరైన కళ్ల సంరక్షణ పరికరాలను ఉపయోగించాలి. తరచూ కళ్లను శుభ్రం చేసుకోవాలి. వారి నుంచి ఇతరులు దూరంగా ఉండాలి. వారి కళ్లను ముట్టుకోవడం చేయకూడదు.
  • కాంటాక్ట్ లెన్స్​ ఉపయోగించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాటిని ధరించే ముందు, తీసేసిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. లెన్స్​ను కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కళ్లలో ఏదైనా ఇబ్బంది ఉంటే వాటిని పెట్టుకోకపోవటమే మంచిది.
Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details