తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2021, 6:49 AM IST

ETV Bharat / sukhibhava

ఈ వ్యాధులు ఉన్న వారికి.. అధిక చలితో ముప్పు తప్పదా?

Extreme Cold Weather: చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఈ చలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధిక చలితో పొంచి ఉన్న ముప్పు ఏంటి? దీని నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.

extreme cold
చలి తీవ్రత

Extreme Cold Weather: చలి తీవ్రత పెరగుతున్నా కొద్ది.. అది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆస్తమా, సీఓపీడీ సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందంటున్నారు. శ్వాసనాళాలు సంకోచించడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. వీరితో పాటు ఐదేళ్లలోపు పిల్లలు, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు, మధుమేహులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

  • ఎక్కువగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
  • ఒమిక్రాన్​ ముప్పు పొంచి నేపథ్యంలో తప్పనిసరిగా కొవిడ్​ నిబంధనలను పాటించాలి.
  • సీఓపీడీ, ఆస్తమా మొదలైన సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు వ్యాధిని నియంత్రణలో ఉంచుకునే మందులు వాడాలి.
  • చర్మంపైన తేమను ఇచ్చే ద్రావణాలను, లేపనాలను రాసుకోవాలి.
  • చలి ఎక్కువగా ఉందని టీ, కాఫీలు తరచూ తీసుకోవడం కూడా మంచిది కాదు.

ABOUT THE AUTHOR

...view details