తెలంగాణ

telangana

పిల్లలకు టీకాలు ఎక్కువగా వేయిస్తే ఆ సమస్య వస్తుందా?

By

Published : Nov 8, 2021, 4:53 PM IST

చిన్నారుల్లో ఆటిజం రావడంపై తల్లిదండ్రులకు అనేక సందేహాలు వస్తుంటాయి. టీకాలు ఇప్పించడం వల్లే పిల్లలకు ఆటిజం వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. మరి ఇది ఎంతవరకు నిజం? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

autism causes
పిల్లలకు టీకాలు ఎక్కువగా వేయిస్తే ఆ సమస్య వస్తుందా?

ఆటిజం అనేది వయసుతో ప్రమేయం లేకుండా ఎవరిపై అయినా ప్రభావం చూపించగలదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అధికశాతం జెనెటిక్స్​ ద్వారా వ్యాపించే వ్యాధి అని.. తల్లిదండ్రులు లేదా వారి పూర్వీకుల్లో ఈ సమస్య ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆటిజంపై నిపుణులు ఇంకా ఏమంటున్నారు అంటే..

  • పిల్లలు పెరుగుతున్న వాతావరణం ద్వారా కూడా ఆటిజం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒంటరితనం, గ్యాడ్జెట్స్​ , తల్లిదండ్రుల మధ్య గొడవలు, తల్లి లేదా తండ్రి మాత్రమే​ ఉన్న వారిలో ఈ వ్యాధి రావచ్చు.
  • 5 లేదా 6 ఏళ్ల లోపు పిల్లలకు సరైన పోషకాలు అందకపోయినా, వారికి తల్లిదండ్రులతో ఎమోషనల్​ బాండింగ్​ సరిగ్గా లేకపోయినా ఈ వ్యాధి రావచ్చు.
  • వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఆటిజం వచ్చే అవకాశం ఉందా అనే విషయంపై రెండు దశాబ్దాల క్రితమే పరిశోధన జరిగింది. అయితే ఆటిజంకు, వ్యాక్సిన్లు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. అందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని పరిశోధకులు స్పష్టం చేశారు.

కాబట్టి ఆటిజం వస్తుందనే ఆపోహతో టీకాలు ఇప్పించడం మానుకోవద్దు అంటున్నారు నిపుణులు. సంబంధిత వయసులో వేయించాల్సిన టీకాలు పిల్లలకు తప్పనిసరిగా ఇప్పించాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి :ఈ ఆహారంతో ఎప్పటికీ యవ్వనమే..

ABOUT THE AUTHOR

...view details