తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీరు పడుకునే ముందు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? - ఆ నష్టం గ్యారెంటీ!

Excessive Phone Use Health Issues : రాత్రి నిద్రపోయే ముందు అదే పనిగా ఫోన్ చూస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు నిద్రను దూరం చేయడమే కాదు.. పలు ప్రమాదకరమైన వ్యాధులకూ కారణం అవుతుందట!

Smart Phone Side Effects on Health
Smart Phone Side Effects on Health

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 4:40 PM IST

Smart Phone Side Effects on Health : పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ చేతిలోనే ఉండే పరికరం ఏది అంటే.. అది సెల్‌ఫోన్‌ అని ఠక్కున చెప్పవచ్చు. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు జనం. అయితే.. విచ్చలవిడిగా ఫోన్ వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట అతిగా స్మార్ట్​ఫోన్ వాడితే, నిద్ర దూరం కావడమే కాదు.. మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ : మనం నిత్యం వాడే స్మార్ట్‌ఫోన్‌ నీలి కాంతిని విడుదల చేస్తుంది. ఫోన్​ స్క్రీన్​ నుంచి వచ్చే బ్లూ లైట్​కి ఎక్కువ గురయితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. మీరు ఫోన్​లో ఈ-మెయిల్స్ తనిఖీ చేయడం, సోషల్ మీడియా సైట్‌లను వీక్షించడం, గేమ్స్ ఆడడం.. లాంటివి చేస్తుంటే మీ దృష్టంతా వాటిపైనే యాక్టివ్​గా ఉంటుంది. దాంతో మీరు తగిన నిద్ర పోవడానికి అవకాశం ఉండదు. ఇది నిద్ర లేకుండా చేయడమే కాదు.. నిద్రలో కూడా ఇది ఇబ్బంది కలిగిస్తుందట.

ఒత్తిడి పెరగవచ్చు :ప్రశాంతంగా ఉండేవారికి త్వరగానే నిద్ర వచ్చేస్తుంది. ఒత్తిడిలో ఉండే వారికే.. సరిగా నిద్ర రాదు. ఇలాంటి వారు ఫోన్​తో కాలక్షేపం చేస్తుంటారు. దీంతో.. నిద్ర మరింత దూరమవుతుంది. ఫలితంగా.. అప్పటికే ఉన్న ఒత్తిడి స్థాయి మరింత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా.. సోషల్ మీడియా​లో ఎవరితోనైనా చాట్ చేస్తున్నా.. ఏదైనా నెగెటివ్ అంశంపై డిస్కస్ చేస్తున్నా.. మీ మెదడుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది నిరంతరం కొనసాగితే మానసిక సమస్యగా మారే అవకాశమూ ఉంటుంది.

రాత్రిళ్లు ఫోన్ వాడకాన్ని తగ్గించే 7 చిట్కాలు.. ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు!

కంటి సమస్యలు మొదలవుతాయి : మీరు ఎక్కువసేపు స్మార్ట్​ఫోన్​ని ఉపయోగించినప్పుడు కళ్లు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా నైట్ లైట్లు ఆఫ్ చేసి.. ఫోన్ చూస్తున్నట్టయితే.. కళ్లకు మరింత పని పెట్టినవారవుతారు. దీంతో.. ఫోన్ స్క్రీన్​ నుంచి బ్రైట్​గా కనిపించే ఆ బ్లూ లైట్​ చూస్తూ.. కళ్లు పగటివేళ కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో.. కళ్లపై మరింత ప్రెజర్ పెరుగుతుంది. ఫలితంగా.. కళ్లు పొడిబారడం, దురద, మంట, ఎర్రబడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు లాంగ్​ టైమ్​ కొనసాగితే చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల.. ఇప్పుడే ఈ అలవాటుకు గుడ్​బై చెప్పండి.

ఇందుకోసం కొన్ని పనులు మొదలు పెట్టండి. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటానికి బదులు.. మీకు నచ్చిన ఏదైనా పుస్తకాన్ని చదవడం అలవాటుగా చేసుకోండి. దానికన్నా ముందు భోజనం ఆలస్యంగా చేయకుండా 7-8 గంటల్లోపు ముగించండి. దానికి ముందు.. గోరువెచ్చని నీటితో మనసును రిలాక్స్​ చేస్తూ స్నానం చేయండి. ఇదొక దినచర్యగా మార్చుకుంటే ఫోన్​ అడిక్షన్​ సమస్యను దూరం చేసుకోవచ్చు. ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించొచ్చు.

Impact of Smartphone Usage in Children : డేంజర్​ బెల్స్​.. పిల్లలకు స్మార్ట్​ఫోన్​ ఇస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త

ఫోన్​ వాడకం తగ్గించుకోలేకపోతున్నారా... అయితే ఈ యాప్​ వాడండి...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details