వ్యక్తిగత పరిశుభ్రతతో 50 శాతం అంటువ్యాధులను నివారించవచ్చని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్(ఏజేఐసీ) వ్యాసం ప్రచురించింది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి కనీస ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే యాంటీబయాటిక్స్ అవసరం 30 శాతం వరకూ తగ్గుతుందని స్పష్టం చేసింది. వ్యూహాత్మక ప్రణాళికల్లో పరిశుభ్రత భాగమైతే ఏటా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) కారణంగా సంభవించే వేలాది మరణాలను తగ్గించవచ్చని వెల్లడించింది. వీరంతా సూక్షజీవుల కారణంగా వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యక్తిగత పరిశుభ్రతే చాలా కీలకమైందని ఏజేఐసీ స్పష్టం చేసింది. రోజువారి దినచర్యలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి భాగమయ్యాయని పేర్కొంది. అయితే జాతీయ, అంతర్జాతీయ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వ్యూహాలు మాత్రం సామాజిక పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యాయని వివరించింది. ఈ వ్యాసాన్ని ప్రపంచ పరిశుభ్రత మండలి(జీహెచ్‌సీ) తరఫున ఆన్లైన్లో ప్రచురించింది ఏజేఐసీ.