Eroxon stim gel : అంగస్తంభన లోపానికి సంబంధించిన ఓ జెల్‌ను వైద్యుల సిఫార్సు లేకుండానే నేరుగా మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) అనుమతులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ జెల్ తయారీ సంస్థ ఫ్యూటురా మెడికల్ వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన 'ఎరోక్సాన్' అనే జెల్‌కు ఎఫ్‌డీఏ ఈ మేరకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. వైద్య ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన 'డి నోవో' వర్గీకరణలో ఈ ఔషధాన్ని ఎఫ్‌డీఏ చేర్చినట్లు ఫ్యుటురా మెడికల్ సోమవారం వెల్లడించింది. ఉన్నతస్థాయి నిపుణులతో కూడిన ఎఫ్‌డీఏ బృందం ఔషధాన్ని పరిశీలించినట్లు తెలిపింది. అంగస్తంభన లోపానికి సంబంధించి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న తొలి ఔషధం/ చికిత్స ఇదేనని పేర్కొంది. తమ ఉత్పత్తులు ఎఫ్‌డీఏ ప్రమాణాలను అందుకోవడం సంతోషంగా ఉందని ఫ్యుటురా మెడికల్ సీఈఓ జేమ్స్ బార్డర్ పేర్కొన్నారు.
ఏంటీ ఎరోక్సాన్?
Eroxon cream reviews : అంగస్తంభన లోపం ఉన్నవారి కోసం ఈ జెల్‌ను తయారు చేసింది ఫ్యూటురా మెడికల్. ఈ జెల్‌ను ట్యూబ్లలో పెట్టి విక్రయిస్తోంది. ఒక్కో ట్యూబ్.. ఒక డోసులా పనిచేస్తుంది. సంభోగంలో పాల్గొనాలని అనుకున్నప్పుడు దీన్ని ఉపయోగించాలి. పురుషాంగం కొనకు ఈ జెల్‌ను రాసుకోవాలని కంపెనీ చెబుతోంది. దీన్ని వాడితే పది నిమిషాల్లోనే అంగం స్తంభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ జెల్ వాడిన 65 శాతం మంది వినియోగదారులు సుదీర్ఘ సెక్స్‌ను విజయవంతంగా ఆస్వాదించారని తెలిపింది. జెల్ ప్రభావం దానికదే తగ్గుతుందని స్పష్టం చేసింది.